ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

Shiv Sena : కమెడియన్ కుణాల్ కామ్రాపై శివసేన సంచలన వాక్యలు..!

Shiv Sena : కమెడియన్ కుణాల్ కామ్రాపై శివసేన సంచలన వాక్యలు..!
ADVERTISEMENT

స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రాను అరెస్ట్ చేయాలని ఆదివారం శివసేన డిమాండ్ చేసింది.కుణాల్ కామ్రా ఒక స్టాండప్ కామెడీ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేను ద్రోహిగా అభివర్ణించినట్లు ఆరోపణలు వచ్చాయి.శివసేన సైనికులు ఎవరూ దీన్ని సహించలేరని, కుణాల్‌కు ‘శివసేన తరహా చికిత్స’ తప్పదని శివసేన అధికార ప్రతినిధి కృష్ణ హెగ్డే అన్నారు.

”కుణాల్ కామ్రాను ముంబయి పోలీసులు అరెస్ట్ చేయాలి. జైల్లో పెట్టి అతన్ని విచారించాలి. కుణాల్ కామ్రా తిట్లు, ఆయన వాడిన అశ్లీల పదాలు, ఏక్‌నాథ్ శిందేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రజలకు అవమానం. గతంలోనూ కుణాల్ ఇలాగే ప్రవర్తించారు. విమానాల్లో ప్రయాణించకుండా ఆయన ఆరు నెలల నిషేధానికి గురయ్యారు. ఇప్పుడు కూడా ఆయనకు కఠినమైన శిక్ష విధించాలి” అని కృష్ణ హెగ్డే అన్నారు.

ముంబయిలోని ఖార్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌పై ఆదివారం పొద్దుపోయాక శివసేన కార్యకర్తలు దాడి చేశారు. హోటల్‌ను ధ్వంసం చేశారు. ఈ హోటల్‌లోనే కుణాల్ కామ్రా స్టాండప్ కామెడీ కార్యక్రమం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. యూనీకాంటినెంటల్ హోటల్‌ను దుండగులు ద్వంసం చేశారు.శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ కూడా కుణాల్ కామ్రాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించారు.

కుణాల్ కామ్రా రెండు రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే శివసేన సైనికులు అతన్ని ముంబయి రోడ్లపై తిరగనివ్వరంటూ ఆదివారం మీడియాతో ముర్జీ పటేల్ అన్నారు.

”ఎక్కడ కనిపించినా, అతని ముఖానికి నల్లరంగు పులుముతాం. అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ఫేమ్ కోసం కుణాల్ ఇదంతా చేస్తున్నారు. పోలీసులకు అవసరమైన సమాచారాన్ని అందించాం. సరైన చర్య తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు” అని ముర్జీ పటేల్ చెప్పారు.శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్, ప్రస్తుతం వివాదానికి కారణమైన కుణాల్ కామ్రా వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసి ‘కుణాల్ కా కమాల్’ అనే వ్యాఖ్య జోడించారు.శివసేన ఎంపీ నరేశ్ హస్కే కూడా ఒక వీడియో మెసేజ్‌లో కుణాల్ కామ్రాను బెదిరించారు.

”మహారాష్ట్రలోనే కాకుండా దేశంలోనే నిన్ను తిరగకుండా చేస్తాం. శివసేన సైనికులు వెంటాడటం మొదలుపెడితే దేశం విడిచి పారిపోవాల్సి ఉంటుంది. సంజయ్ రౌత్ ఇప్పుడు మీ వద్ద కార్యకర్తలు ఎవరూ లేకపోవడంతో డబ్బులిచ్చి కుణాల్ కామ్రాతో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు. మిమ్మల్ని తలుచుకుంటే సిగ్గేస్తుంది. కుణాల్ కుమ్రా, మీకు దేశంలో తిరగడం కూడా కష్టమవుతుందనే సంగతి గుర్తు పెట్టుకోండి” అని నరేశ్ వీడియోలో పేర్కొన్నారు.

శివసేన (యూబీటీ) నాయకుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే.. స్టూడియోపై దాడిని పిరికితనమంటూ సోమవారం రాత్రి స్పందించారు.”మింధే (శిందే) పిరికి గ్యాంగ్, కామెడీ వేదికను ధ్వంసం చేసింది. ఆ వేదికపై ఏక్‌నాథ్ శిందే గురించి ఒక పాట పాడారు. అది 100 శాతం కరెక్ట్ పాట. పిరికిపందలు మాత్రమే ఒక పాటకు ఈ విధంగా స్పందిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వ్యవస్థ ఇలాగే ఉంటుందా? ఏక్‌నాథ్ శిందే మరోసారి ముఖ్యమంత్రి, హోంమంత్రి బలహీనులని నిరూపించారు” అని ఠాక్రే స్పందించారు.

ఠాక్రే ఎప్పుడూ శిందేను ఉద్దేశించి మింధే అనే మరాఠీ పదాన్ని వాడతారు. మింధే అంటే మరాఠీలో విశ్వాసపాత్రుడు అని అర్థం.కుణాల్ కామ్రా తన కామెడీ కార్యక్రమంలో ‘దిల్ తో పాగల్ హై’ సినిమాలోని ఒక పాటకు పేరడీ పాడారు. ఈ పాటలో 2022 నాటి శివసేన చీలికను ప్రస్తావించారు.

కామ్రా ఆ పాటలో ‘గద్దార్’ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ పదాన్ని ఏక్‌నాథ్ శిందేను ఉద్దేశించి వాడినట్లుగా భావిస్తున్నారు. అయితే, కుణాల్ కామ్రా తన పాటలో ఏక్‌నాథ్ శిందే పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.”నిన్నటి ఘటన యాదృచ్ఛికంగా జరుగలేదు. వాళ్లు ఎందుకు అఫెండ్ అయ్యారు. ఆయన ఎవరి పేరును ప్రస్తావించలేదు. కామ్రా కవితలో కేవలం గద్దార్ అనే పదం మాత్రమే ప్రస్తావించారు. దానికే శిందే మద్దతుదారులు స్పందించారు. అంటే, వాళ్లు ఆ పదాన్ని తమకు ఆపాదించుకొని అంగీకరించారన్నట్లే కదా” అని ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యానించారు.

Tags: #ComedyControversy#FreedomOfSpeechDebate#KunalKamra#PoliticalSatire#ShivSena#ShivSenaVsKunalKamra
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ys Jagan : ఆ డీఎస్పీతో సెల్యూట్ కొట్టిస్తా!

Next Post

Malavika Mohanan : అనుకున్నది ఒకటి.. అయినది మరోటి..!

Related Posts

IQ EQ SQ
Big Story

IQ EQ SQ: ఐక్యూ, ఈక్యూ, ఎస్‌క్యూ – తెలివితేటల కంటే భావోద్వేగ మేధస్సే జీవితాన్ని నిలబెడుతుంది

NEETPaperLeak
Big Story

NEETPaperLeak:దేశవ్యాప్త ఉద్యమం.. యువత ఆవేదనకు ముగింపు ఎప్పుడు

AP Irrigation White Paper
Andhra Pradesh

AP Irrigation White Paper: రెండేళ్లలో జలవనరుల రంగంలో అద్భుత ప్రగతి.. 2028 నాటికి 36 ప్రధాన ప్రాజెక్టులు పూర్తి: మంత్రి

Kodangal Development
Big Story

Kodangal Development: కొడంగల్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి.. ఆగస్టు 30న మళ్లీ వస్తా: సీఎం రేవంత్ రెడ్డి

NEET Paper Leak Protest
Big Story

NEET Paper Leak Protest: నీట్ పేపర్ లీక్‌పై మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

Anikha Surendran
Entertainment

Anikha Surendran: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న అనిఖా సురేంద్రన్.. వరుస క్రేజీ ఆఫర్లతో ఫుల్ బిజీ!

Next Post
Malavika Mohanan :  అనుకున్నది ఒకటి.. అయినది మరోటి..!

Malavika Mohanan : అనుకున్నది ఒకటి.. అయినది మరోటి..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

IQ EQ SQ

IQ EQ SQ: ఐక్యూ, ఈక్యూ, ఎస్‌క్యూ – తెలివితేటల కంటే భావోద్వేగ మేధస్సే జీవితాన్ని నిలబెడుతుంది

NEETPaperLeak

NEETPaperLeak:దేశవ్యాప్త ఉద్యమం.. యువత ఆవేదనకు ముగింపు ఎప్పుడు

AP Irrigation White Paper

AP Irrigation White Paper: రెండేళ్లలో జలవనరుల రంగంలో అద్భుత ప్రగతి.. 2028 నాటికి 36 ప్రధాన ప్రాజెక్టులు పూర్తి: మంత్రి

Kodangal Development

Kodangal Development: కొడంగల్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి.. ఆగస్టు 30న మళ్లీ వస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info