బుల్లి తెర నుంచి వెండి తెరపై అడుగు పెట్టి అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట తన అందంతో అలరించిన ముద్దుగుమ్మ షామా సికిందర్. బాలీవుడ్‌లో ఈ అమ్మడికి మంచి గుర్తింపు ఉంది. షామా సికిందర్ బుల్లి తెరపై చేసిన సందడి అంతా ఇంతా కాదు. హీరోయిన్‌గా వచ్చిన చిన్నా చితక ఆఫర్ల విషయంలో ఆచితూచి అడుగు వేస్తూ ఆఫర్లకు కమిట్ అవుతున్న షామా సికిందర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ స్థాయిలో ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె ఏ ఫోటో షేర్ చేసినా వెంటనే వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం కావడంతో నెట్టింట ఎప్పుడూ ఈమె వైరల్ అవుతూనే ఉంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆకట్టుకునే అందాల ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా మరోసారి షామా సికిందర్ ఆకట్టుకునే అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ స్థాయిలో తన అందంతో మతి పోగొడుతున్న షామా సికిందర్ రెడ్ డ్రెస్‌లో అది కూడా క్లీ వేజ్ షో చేయడం ద్వారా నెటిజన్స్ చూపు తిప్పలేక పోతున్నారు. ఈ స్థాయిలో అందంగా ఉంది.. ఈమె వయసు రెండు పదులు అయ్యి ఉంటుందని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఈమె వయసు 44 ఏళ్లు. నాలుగు పదుల వయసులోనూ రెండు పదుల వయసు అమ్మాయి మాదిరిగా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అంటే ఈమె సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈమె అందాల ఫోటోలకు అంతా ఫిదా అవ్వాల్సిందే.
ఈ వయసులోనే షామా సికిందర్ ఇలా ఉండి ఉంటే అప్పట్లో ఎలా ఉండేదో కదా అంటూ చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజంగానే అప్పట్లోనే ఈమె తన అందంతో బుల్లి తెర ప్రేక్షకులను షేక్ చేసింది. 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమెకు తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కింది. కెరీర్ ఆరంభంలో వెండి తెర ప్రేక్షకుల కంటే బుల్లి తెర ప్రేక్షకులు ఈమెను ఎక్కువగా ఆధరించారు. అందుకే ఈ అమ్మడికి బుల్లి తెర నుంచి ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. సుదీర్ఘ కాలం పాటు బుల్లి తెరపై తన సత్తా చాటిన షామా సికిందర్ అప్పుడప్పుడు మాత్రం వెండి తెరపై కనిపించింది. కానీ వెండి తెరపై ఈమె చేసిన సందడి పెద్దగా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా ఈమె చేసిన సినిమాలు అదృష్టం కలిసి రాకపోవడంతో ఫ్లాప్ అయ్యాయి. అంతే కాకుండా ఈమె సినిమాలకు విమర్శలు తప్పలేదు.
ఈమె అందం బుల్లి తెరకు, సోషల్ మీడియాకే పరిమితం కావడం పట్ల చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం షామా సికిందర్ కంటే చాలా అందం తక్కువ ఉన్న వారు ఇండస్ట్రీలో స్టార్స్‌గా, పెద్ద సినిమాల్లో నటిస్తున్నారు. కానీ షామా సికిందర్ మాత్రం అందం ఉన్నా, ప్రతిభ ఉన్నప్పటికీ ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అవుతోంది అంటూ నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. కానీ భవిష్యత్తులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలోనూ పెద్ద సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు ఈ అమ్మడు సినిమాల్లో బిజీ అయ్యేనా, సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యేనా చూడాలి.