సెలబ్రిటీల టైమ్ టేబుల్ ఎంతో పక్కాగా ఉంటుంది. ఉదయం జిమ్..అనంతరం షెడ్యూల్ ప్రకారం ఇతర పనులు చూసుకోవడం…కంటి నిండా నిద్రా? ఇలా ఓ ప్రణాళిక బద్దంగా ఉంటుంది. చాలా మంది సెలబ్రి టీల టైమ్ టేబుల్ ఇలాగే ఉంటుంది. చాలా అరుదుగా మాత్రమే ఈ టైమ్ టేబుల్ బ్రేక్ అవుతుం టుంది. కానీ బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ టైమ్ టేబుల్ తెలిస్తే మాత్రం షాకింగ్ గానే అనిపిస్తుంది. సెలబ్రి టీల టైమ్ టేబుల్ అన్నింటికీ భిన్నంగా ఉంది. షారుక్ ఖాన్ రోజు తన పనులన్నీ పూర్తి చేసుకునే సరికి అర్దరాత్రి దాటి 2 గంటలు అవుతుంది.
అప్పుడు జిమ్ లో కి వెళ్లి కాసేపు జిమ్ చేస్తాడట. ఆ తర్వాత స్నానం చేసి ఉదయం ఐదు గంటలకు పడుకుంటాడుట. మళ్లీ పది గంటలకు నిద్ర నుంచి లేచి పనిలో నిమగ్నమవుతారుట. అంటే షారుక్ ఖాన్ రోజు పడుకునేది ఆరేడు గంటలు మాత్రమే. ఈ విషయంలో షారుక్ కూడా రాంగో పాల్ వర్మను అనుస రిస్తున్నట్లే. రాంగో పాల్ వర్మ కూడా రాత్రి పూట కేవలం ఆరు గంటలకు తక్కువగానే నిద్రపోతారు. మిగతా సమయమంతా పనుల్లో బిజీగా ఉంటాడు. షారుక్ విషయానికి వస్తే ఆయన పండ్లు కూడా తీసుకోడుట.
కార్పోహైడ్రేట్స్ మితంగానే తీసుకుంటారు. ఐస్ క్రీమ్ లాంటివి అంటే బాగా ఇష్టపడతారు. అలాగే తందూరీ చికెన్ అంటే మాటల్లో చెప్పలేని ఇష్టంగా పేర్కొన్నారు. చాలా సంవత్సరాలుగా తందూరీ చికెన్ మాత్రం మిస్ అవ్వడం లేదన్నారు. ఏడాదంతా తందూరీ మాత్రం తప్పక తింటానంటున్నారు. తందూరీ తన శరీ సౌష్టవాన్ని కావాల్సిన విధంగా మార్చుకోవడానికి ఎంతో సౌకర్యవంతమైన పుడ్ గా పేర్కొన్నారు. మధ్నా హ్నం లంచ్ లో చేపలు..చికెన్ ఉండేలా చూసుకుంటారుట. అప్పుడప్పడు కరీనా కపూర్ కూడా షారుక్ టైమ్ టేబుల్ ని పాటిస్తుంది. డే అంతా ఇతర పనులతో బిజీగా ఉంటుంది. నైట్ షూట్ కి వెళ్తే మాత్రం ఇంటికి తిరిగొచ్చేది తెల్లవారుజామునే. అప్పటి నుంచి ఆరు గంటలు నిద్ర ఉండేలా చూసుకుంటుంది. ఈ క్రమంలో భర్త సైఫ్ అలీఖాన్….పిల్లల్ని కూడా మిస్ అవుతానని ఓ సందర్భంలో తెలిపింది.