ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

SavitriGaneshan:సావిత్రి మామూలు మహానటి కాదు: లలితా జ్యూయలర్స్ వెనుక కథ

SavitriGaneshan:సావిత్రి మామూలు మహానటి కాదు: లలితా జ్యూయలర్స్ వెనుక కథ
ADVERTISEMENT

మహానటి సినిమాలో సావిత్రి గురించి తెలియని చాలా విషయాలను చూపించారు దర్శకుడు. ముఖ్యంగా సావిత్రి దానగుణం గురించి కళ్లకి కట్టిన సీన్లు చాలానే ఉన్నాయి. అయితే నేడు వేల కోట్లకి అధిపతి అయిన లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ కుమార్‌.. మహానటి సావిత్రి చేసిన గొప్ప సాయం గురించి చెప్పుకొచ్చారు. చెన్నైలో ఉన్న లలితా జ్యూయలర్స్ కార్పొరేట్ ఆఫీస్ వెనుకున్న అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.అడిగిన వాళ్లకి కాదనకుండా సాయం చేసి.. దాన గుణంలో రియల్ హీరోయిన్ అనిపించారు మహానటి సావిత్రి. ఆమె దాన గుణం గురించి ఇప్పటికే చాలామంది చాలా సందర్భంలో చెప్పారు.. ‘మహానటి’ సినిమాలో కూడా సావిత్రి దానగుణాన్ని కళ్లకి కట్టారు. అయితే నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ కుమార్.. మహానటి సావిత్రితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ.. చెన్నైలో తన పేరిట ఉన్న ‘సావిత్రి గణేశన్’ బిల్డింగ్ వెనుక ఉన్న రియల్ స్టోరీని షేర్ చేసుకున్నారు.

తాజా ఇంటర్వ్యూలో లలితా జ్యూయలర్స్ ఎండీ కిరణ్ మాట్లాడుతూ.. ‘మొదట్లో నాకు రెండో షోరూంలు ఉండేవి. ఒకటి లలితా జ్యూయలర్స్ చెన్నై, రెండోది లలితా జ్యూయలర్స్ మధురై. ఆ షోరూంలు కూడా.. బాత్ రూం అంత సైజ్‌లోనే చిన్న చిన్నవిగా ఉండేవి. 200 స్క్వేర్ ఫీట్స్‌లో షాప్ ఉండటం అంటే అప్పట్లో పెద్ద విషయం. అందులోనే ఏసీ యూనిట్‌ కూడా ఉండేది. మహా అయితే ఓ నలుగురు కంటే ఎక్కువ మంది పట్టేవారు కాదు ఆ షాప్‌లో. కానీ ఆ తరువాత ఐదు షోరూంలకు పెంచాం.దాని వల్ల ఆఫీస్ కోసం ఆ చిన్న గది సరిపోయేది కాదు. దాంతో చెన్నైలోని ‘సావిత్రి గణేశన్’ గారి ఇంట్లో పై పోర్షన్ అద్దెకి ఇస్తున్నారని తెలిసింది. ఆ బిల్డింగ్‌ని అద్దెకి తీసుకున్నాం. అప్పటికే ఆ ప్లేస్‌లో చాలా ఫర్నిచర్ ఉంది. ఇంత ఫర్నిచర్ ఉందేంటి? అని అడిగితే.. ఇక్కడ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉండేది. వాళ్లు ఖాళీ చేసుకుని వెళ్లిపోయారు అని చెప్పారు. ఇదేంట్రా.. ఇంత ఖరీదైన వాటిని వదిలి వెళ్లిపోవడం ఏంటి? వాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు అనగానే.. నాకు కాస్త నెగిటివ్ ఫీలింగ్ కలిగింది. దాంతో వెళ్లి సావిత్రి అమ్మగారిని అడిగాను. ‘లేదు కిరణ్ వాళ్లు.. సొంత బిల్డింగ్‌లోకి వెళ్లారు. ఇది చాలా రాశి కలిగిన బిల్డింగ్ అని నాతో తెలుగులోనే మాట్లాడారు సావిత్రమ్మ. దాంతో నేను ఆ బిల్డింగ్‌ని అద్దెకి తీసుకున్నాను.

అమ్మ చెప్పినట్టే.. ఆ బిల్డింగ్‌లోకి వెళ్లిన కొన్నాళ్లకే నేను కూడా సొంత ప్రాపర్టీ కొన్నాను. సొంతంగా కార్పొరేట్ ఆఫీస్ కట్టాను. ఇక ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్‌లోకి మారడానికి ఆర్నెళ్ల టైం ఉంది. సావిత్రి అమ్మ ఫోర్త్ ఫ్లోర్‌లో ఉండేవారు. మిగిలిన మూడు ఫ్లోర్‌లు మా ఆఫీస్ ఉండేది. మా ఆఫీస్ రెడీ అయిపోయింది.. ఖాళీ చేస్తాం అని చెప్పడానికి మా మేనేజర్ సావిత్రి అమ్మ దగ్గరకు వెళ్లాడు. మీ ఎండీ ఎక్కడున్నాడో రమ్మను అని అన్నారు. నేను వెంటనే పైకి వెళ్లాను.అక్కా ఇలా ఖాళీ చేస్తున్నాం అని నేను అనగానే.. ‘నువ్వేంట్రా పోయేది.. మేమే ఖాళీ చేసి పోతాం నువ్వే ఉండు’ అని అన్నది సావిత్రి అక్క. ఏంటక్కా ఏమంటున్నావ్.. నాకు అర్థం కావడం లేదు అని అన్నాను. ‘లేదురా.. నువ్వు ఎక్కడికీ పోవడానికి లేదు.. ఈ బిల్డింగ్ నువ్వే తీసుకో అని అన్నది. వెంటనే నా ముందే ఎవరికో ఫోన్ చేశారు. అతను ఫోన్‌లో ఉండగానే.. నాకో అమౌంట్ చెప్పారు. ఇదీ నేను చెప్తున్న అమౌంట్. దానికి నువ్వు ఎంత తగ్గించి ఇస్తావో ఇవ్వు. లేదంటే పెంచి ఇచ్చినా పర్లేదు. నువ్వు ఏం చెప్పినా పర్లేదు.

కానీ ఈ ఇల్లు మాత్రం నీకే ఇస్తాను అని అన్నది అక్క. నేను షాక్‌లో ఉండిపోయాను. నేను వెళ్లి ఇల్లు ఖాళీ చేస్తాం అని చెప్పడానికి.. కానీ అక్క ఇల్లు నాకు రాస్తానంటే నాకు ఏం అర్థం కాలేదు. వెంటనే ఐదే ఐదు నిమిషాల వ్యవధిలోనే మాటలు అయిపోయాయి. ఇల్లు నాకు రాసేసింది. అన్నట్టుగానే ఆర్నెళ్లలోపే ఇల్లు మాకు హ్యాండోవర్ చేసి వాళ్లు వేరే ఇంటికి వెళ్లిపోయారు.ఆ ఆఫీస్‌లో సావిత్రి అమ్మగారిది పెద్ద ఫొటో ఉండేది. లిఫ్ట్‌కి ఎదురుగా నిలువెత్తు ఫొటో ఉండేది. వాళ్లు ఖాళీచేస్తూ ఆ ఫొటోని కూడా తీసుకుని వెళ్లిపోయారు. దాంతో నేను వెంటనే సావిత్రి అమ్మకి ఫోన్ చేశా. అగ్రిమెంట్‌లో మీరు నాకు ఇల్లు మాత్రమే అమ్మారు.. ఆ ఫొటోని తీసుకుని వెళ్తారని ఎక్కడా లేదు.. నాకు ఆ ఫొటో కావాలి.. అని వెంటనే మనిషిని పంపించాను. లేదురా.. నీకు వేరే ఫొటో ఇస్తానులే అని అన్నారు. లేదు నాకు అదే కావాలి అని వెంటనే ఆ ఫొటోని తెప్పించి సేమ్ అదే ప్లేస్‌లో పెట్టించా.

ఇప్పటికీ ఆ ఫొటో అలాగే ఉంటుంది.. ఆ బిల్డింగ్ కూడా ‘సావిత్రి గణేశన్’ పేరుతో అలాగే ఉంది. పేరు కూడా మార్చలేదు. లలితా కార్పొరేట్ ఆఫీస్ అని అడ్రస్ కోసం మేం పెట్టుకున్నాం కానీ.. బిల్డింగ్ పేరు మాత్రం.. ‘సావిత్రి గణేశన్’ అని అలాగే ఉంది. ఆ ఫొటోతో నాకు అంత అటాచ్‌మెంట్ ఎందుకు అంటే.. ఆవిడ అంత స్వచ్ఛంగా నవ్వుతూ ఉండేవారు. నిజంగా కూడా అలాగే ఉండేవారు. మనం ఎంత కోపంలో వెళ్లినా కూడా ఆవిడ నవ్వుతూనే ఉండేవారు. ఇప్పుడు మేం 14 ఫ్లోర్స్‌తో కార్పొరేట్ ఆఫీస్ కడుతున్నాం. కానీ.. ఈ బిల్డింగ్ మాత్రం అలాగే ఉంటుంది’ అంటూ ‘సావిత్రి గణేశన్’ వెనుకున్న రియల్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్.

Tags: #Chennai#CinemaHistory#GoldenHeart#Humanity#InspiringStories#KindnessStory#LalithaJewellers#LalithaJewellersStory#LegendaryActress#Mahanati#MahanatiForever#MahanatiSavitri#RealHeroine#Savitri#SavitriGaneshan#SavitriGariCharitra#SavitriLove#telugucinema#TollywoodLegend#TrueInspiration
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

APPOLICE:ఏపీ పోలీస్‌ విప్లవం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రజలకు పారదర్శక సేవలు

Next Post

Pahalgham Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక సాక్షిగా స్థానిక ఫోటోగ్రాఫర్

Related Posts

Disha Patani Success Story
Entertainment

Disha Patani Success Story: రూ.500తో ముంబైకి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా దిశా పటానీ

Revanth Reddy Speech
Big Story

Revanth Reddy Speech: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం? 117 సీట్లపై రేవంత్ రెడ్డి ధీమా

AP Cabinet Meeting
Andhra Pradesh

AP Cabinet Meeting: 57 అజెండా అంశాలకు ఆమోదం.. బీసీ రిజర్వేషన్లు, అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు

Welfare Schemes
Big Story

Welfare Schemes: సంక్షేమం ఎంత? ఉచితం ఎంత? భవిష్యత్తు ప్రణాళిక ఏంటి?

Toxic Movie 2026
Entertainment

Toxic Movie 2026: కియారా అద్వానీ కోసం యశ్ బాడీగార్డ్‌గా మారాడా? సెట్స్‌లో షాకింగ్ రూల్!

Revanth Reddy Social Justice
Big Story

Revanth Reddy Social Justice: కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్.. రేవంత్‌రెడ్డిది సోషల్ జస్టిస్

Next Post
Pahalgham Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక సాక్షిగా స్థానిక ఫోటోగ్రాఫర్

Pahalgham Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక సాక్షిగా స్థానిక ఫోటోగ్రాఫర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Disha Patani Success Story

Disha Patani Success Story: రూ.500తో ముంబైకి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా దిశా పటానీ

Revanth Reddy Speech

Revanth Reddy Speech: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం? 117 సీట్లపై రేవంత్ రెడ్డి ధీమా

AP Cabinet Meeting

AP Cabinet Meeting: 57 అజెండా అంశాలకు ఆమోదం.. బీసీ రిజర్వేషన్లు, అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు

Welfare Schemes

Welfare Schemes: సంక్షేమం ఎంత? ఉచితం ఎంత? భవిష్యత్తు ప్రణాళిక ఏంటి?

Recent News

Disha Patani Success Story

Disha Patani Success Story: రూ.500తో ముంబైకి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా దిశా పటానీ

Revanth Reddy Speech

Revanth Reddy Speech: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం? 117 సీట్లపై రేవంత్ రెడ్డి ధీమా

AP Cabinet Meeting

AP Cabinet Meeting: 57 అజెండా అంశాలకు ఆమోదం.. బీసీ రిజర్వేషన్లు, అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు

Welfare Schemes

Welfare Schemes: సంక్షేమం ఎంత? ఉచితం ఎంత? భవిష్యత్తు ప్రణాళిక ఏంటి?

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info