ఇండస్ట్రీ వారసురాళ్లను వెండి తెరకు పరిచయం చేయడం అన్నది దర్శక-నిర్మాత కరణ్ జోహార్ కు ఓ హాబీ. పెద్ద పెద్ద హీరోలు..హీరోయిన్ల కూతుళ్లను తన నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చేసి క్రెడిట్ దక్కించుకుంటారు. ఇప్పటికే చాలా మంది వారసుల్ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ని ఆయనే పరిచయం చేసారు. చిన్న కుమార్తె ఖుషీ కపూర్ బాద్యతలు కూడా ఆయనే తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా కరణ్ కన్ను క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాపై పడినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. సారా అందానికి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే పెద్ద స్టార్ అవుతుందని భావిస్తు న్నాడుట. ఈ నేపథ్యంలోనే ఇటీవల సచిన్ ని కలిసి కుమార్తె విషయాలు చర్చించారుట. అందుకు సచిన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. సారాకి ఇప్పటికే సెల డబ్రిటీ స్టేటస్ ఆస్వాదిస్తోంది.
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. సచిన్ కుమార్తె…డేటింగ్ చేసే భామగా వెలిగిపోతుంది. ఇన్ స్టాలో లక్షల మంది ఫాలో వర్స్ ఉన్నారు. బాలీవుడ్ సెలబ్రి టీలతో కలిసి నైట్ పార్టీలకు హాజరవుతుంది.క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్ చేసిందనే ప్రచారం ఉండనే ఉంది. ఇప్పుడు గిల్ కి దూరంగా ఉంటూగల్లీ బాయ్` ఫేమ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది కొత్త ప్రేమాయణం మొదలు పెట్టిందని వార్తలొస్తున్నాయి.
ఇలా సారా పేరు నిత్యం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గానే నలుగుతుంది. సరిగ్గా ఇదే సమయంలో హీరోయిన్ అంటూ సచిన్ ముందుకు కరణ్ వెళ్లడం ఇంట్రెస్టింగ్. మరో విషయం ఏంటంటే? కుమార్తెకు పెళ్లి కొడుకును వెతికే పనిలోనూ సచిన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి పెళ్లి చేసుకుంటుందా? హీరోయిన్ అవుతుందా? అన్నది క్లారిటీ రావాల్సిన అంశం.