సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో విద్యాశాఖలు తాజాగా ఉత్తర్వులు జారీ చేశాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి సెలవులు వర్తింపజేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు సరిపడా విరామం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెలవుల అనంతరం పాఠశాలలు యథావిధిగా తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణలో కూడా అకడమిక్ క్యాలెండర్‌కు అనుగుణంగా సంక్రాంతి సెలవులు అమలు చేయనున్నారు. కొన్ని విద్యాసంస్థల్లో ముందుగానే సెలవులు ప్రారంభం కాగా, అధికారిక ఉత్తర్వుల ప్రకారం అన్ని పాఠశాలలకు ఒకే విధంగా సెలవులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
సంక్రాంతి సందర్భంగా గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సెలవులు ఉపయోగపడనున్నాయని, ప్రయాణ రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. పరీక్షల షెడ్యూల్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు.
విద్యార్ధులకు బిగ్ అప్డేట్. సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే సంక్రాంతి పండుగ సెలవుల పైన విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే 2026 అకడమిక్ క్యాలెండర్ ను ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షల షెడ్యూల్ సైతం విడుదల చేసింది. ఇక, సంక్రాంతి సెలవుల పైనా స్పష్టత ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం తొమ్మిది రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.
సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. సొంత గ్రామాలకు వెళ్లి ఈ పండుగను జరుపు కుంటారు. దీంతో, ఈ పండుగ సెలవులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఇప్పటికే సంక్రాంతి సెలవుల తేదీలను నిర్ధారించింది. జనవరి 10 నుండి జనవరి 18, 2026 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. మొత్తం 9 రోజులు సెలవులు ఉంటాయి. జనవరి 19, 2026న తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి. తెలంగాణలో ప్రభుత్వం ఇదే విధంగా సెలవులను ఖరారు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో జనవరి 10 నుండి జనవరి 15, 2026 వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చేందుకు తొలుత ప్రతిపాదనలు చేసారు. అయితే, ఇప్పుడు ఏపీ తరహాలోనే సెలవుల పైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
సెలవుల అనంతరం సిలబస్ ప్రకారం తరగతులు యథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షలు, అకడమిక్ క్యాలెండర్‌లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. సంక్రాంతి పండగలకు ఊళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్స్ చేస్తారు. రైల్వే, ఆర్టీసీ సైతం సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో.. ముందస్తుగా రైళ్లు, బస్సు టికెట్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వర్తిస్తాయి. అదనంగా పాఠశాలలు జనవరి 23న వసంత పంచమి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవులు ఉన్నాయి. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ. జనవరి 17, 2026న ముక్కనుమ ఇలా వరుసగా పండగను జరుపుకుంటారు. ఇందుకు అనుగుణంగా సెలవులు ప్రకటించారు.
#Sankranti Holidays









