ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకొని.. పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని వేరుపడింది. అప్పటినుంచి నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్న ఈమె.. మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది . అలా ఒకవైపు భర్త దూరం అవ్వడం.. మరొకవైపు వ్యాధి తీవ్రతరం చేయడంతో జీవితంలో ఒక్కసారిగా సతమతమైపోయింది సమంత..
ఇప్పుడిప్పుడే అన్నింటి నుంచి కోలుకొని మళ్ళీ ఇండస్ట్రీలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లు ప్రకటిస్తూ బిజీగా మారిన ఈమె.. తెలుగులో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాని కూడా ప్రకటించింది. ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమంత ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. ‘శుభం’ అనే సినిమా తీసి సక్సెస్ అందుకోవడమే కాకుండా అందులో మాయా పాత్రలో నటించి ఆకట్టుకుంది.
ఇలా ఒకవైపు సినిమాలు.. వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్న సమంత.. మరొకవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే నిత్యం పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. తాజాగా షేర్ చేసిన ఫోటోలలో ఈమె ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో సమంత పెట్టుకున్న వాచ్ ఏ కంపెనీకి చెందింది? దాని ధర ఎంత? అంటూ నెటిజన్లు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. మరి సమంత పెట్టుకున్న వాచ్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా సమంత ధరించిన వాచ్ ట్రాపేజ్డ్ ఆకారంలో ఉండే పియాజెట్ 60 జువెలరీ వాచ్. దీని ధర సుమారుగా 30 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్, అభిమానులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే సమంత ఇలాంటి లగ్జరీ వాచ్ లు ధరించడం ఇదేమి తొలిసారి కాదు.. గతంలో కూడా పలు స్టైలిష్ అలాగే లగ్జరీ వాచెస్ ను ధరించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా గతంలో ఈమె ధరించిన బల్గారి సర్ఫెంటి వాచ్ ధర ఏకంగా 46 లక్షలకు పైమాటే. ఇలాంటి బ్రాండెడ్ మోడల్స్ , ఖరీదైన వాచ్లు ఈమె దగ్గర చాలానే ఉన్నాయని చెప్పవచ్చు.
సమంత వ్యక్తిగత విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా జిమ్ లో కలిసి కనిపించడం, వెకేషన్స్ కి వెళ్లడం, హోటల్స్ లో కనిపించడం ఇలా ఎక్కడపడితే అక్కడ ఈ జంట కనిపించేసరికి వీరిపై రూమర్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. దీనిపై అధికారికంగా వీరిద్దరూ స్పందించకపోవడంతోనే ఈ రూమర్స్ దావనంలా వ్యాపిస్తున్నాయని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ రూమర్స్ కి సమంత – రాజ్ చెక్ పెట్టాలని కూడా ఫ్యాన్స్ కోరుతూ ఉండడం గమనార్హం.