టాలీవుడ్ లో సమంత జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్ గా వెలుగుతోన్న సమయంలో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకోవడం..అటుపై విడిపోవడం అన్నీ వేగంగా జరిగిపోయాయి. అప్పటి నుంచి అమ్మడు బాలీవుడ్ లో తిష్ట వేసింది. అదే సమయంలో దర్శక, నిర్మాత రాజ్ నిడిమోరుతో రెండవ సారి ప్రేమలో పడింది. ఇటీవలే అతగాడితో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ మధ్యలో సమంత ప్రోఫెషనల్ గా పెద్దగా బిజీ అవ్వలేదు. ఒకటి రెండు చిత్రాలతో పాటు, బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ కోసమే పని చేసింది.
మరి అవకాశాలు రాక బిజీ కాలేదా? వచ్చినా తిరస్కరించిందా? బాలీవుడ్ లో మాత్రమే పని చేయాలనుకుందా? ఇదంతా గతం.తాజాగా మరోసారి ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో ఇకపై సమంత నిర్ణయాలు ఎలా ఉంటాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. భర్త రాజ్ నిడిమోరు రూపంలో బాలీవుడ్ లో మంచి బ్యాకప్ దొరికినట్లే. సమంత కోసం తానే కొన్ని పాత్రలు సృష్టించగలడు. అది అతడి చేతుల్లో పనే. అతడికి ఉన్న పరిచయాలతో ఛాన్సులు ఇప్పించగలడు. అలా కొంత వరకూ సాధ్యమవుతుంది.
అటుపై సమంత ట్యాలెంట్ పైన నే బాలీవుడ్ లో నెట్టుకురావాల్సి ఉంటుంది. మరి టాలీవుడ్ లో కెరీర్ ని ఎలా ప్లాన్ చేస్తుంది? అన్నది కీలకమే. సమంత టాలీవుడ్ లో ఇంకా ఔట్ డేట్ అవ్వలేదు. నటిగా ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బలమైన ప్యాన్ బేస్ కూడా ఉంది. చైతన్యతో బ్రేకప్ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. `ఖుషీ` తర్వాత అమెరికాలో ఏడాది ఉన్నా? ఎంతో మంది దర్శక,నిర్మాతలు అమ్మడిని అప్రోచ్ అయ్యారు. కానీ ఆ అవకాశాలన్నింటిని సామ్ తిరస్కరించింది. ఇలా ఎందుకు చేసింది? అన్నది నేటికి అంతకు చిక్కని సందేహమే.
మరి రెండవ పెళ్లి తర్వాత థర్డ్ ఇన్సింగ్స్ ఎలా ప్లాన్ చేస్తుంది? అన్నది చూడాలి. తెలుగు సినిమాలు చేస్తుందా? లేక బాలీవుడ్ కే పరిమితమవుతుందా? ఈ రెండు గాక కొత్త ప్లానింగ్స్ ఏవైనా ఉన్నాయా? అన్నది తెలియాలి. అలాగే కెరీర్ పరంగా భర్త నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది? అన్నది క్లారిటీ రావాలి. రాజ్ నిడిమోరు ప్రోఫెషనల్ దర్శకుడు కాబట్టి? సామ్ ష్యాషన్ కు ఎలాంటి అడ్డంకి చెప్పే అవకాశాలు ఉండకపోవచ్చు. అలాగే సామ్ నిర్మాతగా బ్యానర్ కూడా స్థాపించిన సంగతి తెలిసిందే. `శుభం` అనే చిత్రాన్ని కూడా నిర్మించింది. మరో సినిమా ఆన్ సెట్స్ లో ఉంది.
















