బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకునే బాపతు కాదని తేలిపోయింది. ఉన్నంత కాలం సోలోగా లైఫ్ లీడ్ చేయడం తప్ప ధాంపత్య జీవితం అనే బంధం ఆయన జీవితంలో లేదని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే వయసు కూడా 60 ఏళ్లకు దగ్గరగా ఉన్నారు. ఈ వయసులో పెళ్లి చేసుకుని సాధించేది? ఏముంటుంది అన్నది ఆయన వెర్షన్. రెండు ..మూడేళ్ల క్రితం వరకూ సల్మాన్ పెళ్లి గురించి సోషల్ మీడియా సహా మెయిన్ స్ట్రీమ్ లో అప్పుడప్పుడు కథనాలు కనిపించేవి. కానీ ఇప్పుడా కథనాలకు పుల్ స్టాప్ పడింది.
సల్మాన్ ఖాన్ పెళ్లి సంగతి అంతా మర్చిపోయారు. షష్టి పూర్తి వయసులో పెళ్లేంటిలే? అన్న విమర్శలకు తావు ఇవ్వకుండా ఆయనా కూడా సైలెంట్ అయిపోయాడు. ఒవకేళ తాను పెళ్లి చేసుకుంటే గనుక రామ్ చరణ్ వయసున్న కొడుకు ఉండేవాడని ఓ సందర్భంలో భాయ్ బాధపడ్డాడు. పెళ్లి చేసుకోకుండా తప్పు చేసానా? అన్న భావన ఆయన లో కనిపించింది. ఆర్. నారాయణమూర్తి తరహాలో యువతకు తన రూపంలో చిన్న సోషల్ సందేశం పంపించే ప్రయత్నం చేసాడు. కానీ అది జనాల్లోకి పెద్దగా వెళ్లలేదు.
ఆ సంగతి పక్కన బెడితే భాయ్ పెళ్లి చేసుకోకపోయినా? భార్యా భర్తలు ఎలా ఉంటే వాళ్ల ధాంపత్య జీవితం బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేసారు. బంధంలో ఒకరికి మించి ఒకరు ఎదిగితేనే సమస్యలొస్తాయన్నారు. ఇద్దరు కలిసి అన్నింటిని సమానంగా పంచుకుంటేనే ఆ బంధం బలంగా ఉంటుందన్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణితో ఉంటే మాత్రం ఆ బంధం మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందున్నారు. ఎలాంటి దాపరికాలు లేకుండా? స్వచ్ఛంగా ఉంటూ ఒకర్ని ఒకరు అర్దం చేసుకుంటూ వెళ్లే కాపురంలో ఎలాంటి కలతలకు ఛాన్స్ ఉండదన్నారు.
అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా? వాటిని వెంటనే పరిష్కరించుకునే వీలుటుందన్నారు. పెళ్లి చేసుకోకపోయినా సల్మాన్ ఖాన్ ఈ విషయాలన్నీ ఎలా చెబుతున్నారు? అన్న సందేహం రావడం సహజం. ఆయన పెళ్లి చేసుకోకపోయినా? పలువురు భామలతో సహజీవనం చేసిన అనుభవం ఉంది. హీరోగా ఆయన కెరీర్ మొదలైన నాటి నుంచి నేటికి సహజీవనం అనే పాలసీని బాగా అమలు పరుస్తోన్న ఏకైకా హీరో అతడు. ఈ నేపథ్యంలో తనకున్న చిన్న అనుభవంతో? రిలేషన్ షిప్స్ గురించి స్పందించినట్లు తెలుస్తోంది.