ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Ysrcp:2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో సజ్జల

Ysrcp:2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో సజ్జల
ADVERTISEMENT

వైసీపీ అధికారం కోల్పోయినప్పటికీ, ఆ పార్టీ అంతర్గతంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారుగా కీలక భూమిక పోషించిన ఆయన, ఇప్పుడు పార్టీని తన చేతుల్లోనే ఉంచుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో సజ్జల పాత్ర ఉన్నట్టు పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.

తాజాగా, సజ్జల తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నుంచి కీలక టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం పార్టీ లోపలే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ కమిటీల భర్తీపై ఆదేశాలు ఇచ్చిన సజ్జల, కీలక నేతలందరికీ టాస్క్ అప్పగించారు. జగన్ అందుబాటులో లేని సమయంలో సజ్జలనే అన్నీ తానై వ్యవహరించడంపై ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆయన ధోరణిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

గతంలో పార్టీని విజయపథంలో నడిపించిన నేతలకన్నా, ఇప్పుడు వేరే వ్యక్తులే అధికారం వహిస్తున్నారన్న భావన పార్టీ నేతల్లో పెరుగుతోంది. వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ నేతృత్వం గణనీయమైన మార్పును అనుసరిస్తుందా లేక సజ్జల వర్గమే పాలనను కొనసాగిస్తుందా? అన్నది పార్టీ భవిష్యత్తును నిర్ణయించనున్నది. జగన్ 151 నుంచి 11 స్థానాలకు పరిమితమైనా, తన చుట్టూ ఉన్న వ్యక్తుల తీరును మార్చుకుంటారా లేదా అన్నది కీలక ప్రశ్నగా మారింది. ప్రస్తుతం సజ్జల నిర్వహిస్తున్న పార్టీ సమావేశాలు, టెలీ కాన్ఫరెన్సులు చూస్తుంటే, ఆయన తన హవాను కొనసాగించేందుకు మరింత గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇటీవల నిర్వహించిన ఫీజు పోరాటాన్ని విజయవంతం చేశారని పార్టీ శ్రేణులను అభినందించిన తీరూ, సజ్జల తన ప్రభావాన్ని కొనసాగించాలనే ప్రణాళికలో ఉన్నారనే సంకేతాలనిస్తోంది. ఇదిలా ఉండగా, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా, పలువురు సీనియర్ నేతలు సజ్జల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. నేరుగా సజ్జల పేరును ప్రస్తావించకున్నా, జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే పార్టీ నష్టపోయిందని వారు బహిరంగంగానే పేర్కొన్నారు.

ఏపీలో విపక్ష పార్టీ వైసీపీలో ఓ వింత పరిస్థితి కొనసాగుతోంది. పార్టీకి చెందిన సీనియర్ నేతల దగ్గర నుంచి…సామాన్య కార్యకర్త దాకా… పార్టీ రాష్ట్ర సమన్వయకర్త హోదాలో కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిపై పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ సలహాదారుగా కొనసాగిన సజ్జల…విపక్షాల చేత సకల శాఖా మంత్రిగా పిలిపించుకున్న సంగతి తెలిసిందే. ప్రతి విషయంలో సజ్జల జోక్యం అంతకంతకూ పెరిగిపోయిందని…పార్టీలో ఏం జరుగుతున్న దానిని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు చేరకుండా అడ్డుకున్నారని… ఫలితంగానే 2024 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా పరాభవం చవిచూడాల్సి వచ్చిందని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ పార్టీలో సజ్జల హవా ఇప్పటికీ ఇసుమంత కూడా తగ్గలేదనే చెప్పాలి. అంతేనా… జగన్ అందుబాటులో లేకుంటే సజ్జలనే అన్నీ తానై వ్యవహరిస్తున్నారని కూడా చెప్పక తప్పదు.

ఇటీవల తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి సజ్జల పార్టీకి చెందిన ఓ కీలక అంశంపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, ఆయా అనుబంధ విభాగాల అధ్యక్షులు.. మొత్తంగా పార్టీకి చెందిన కీలక నేతలంతా ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో అన్నిస్థాయిలో కమిటీలను తక్షణమే భర్తీ చేయాలని సజ్జల ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో అలక్ష్యాన్ని సహించేది లేదని జగన్ చెప్పినట్లుగా ఆయన తెలిపారు. రీజనల్ కో ఆర్డినేటర్ల నుంచి నియోజకవర్గ స్థాయి నేతలంతా అందుబాటులో ఉంటారని… వారి సహకారంతో పార్టీ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే దిశగా సాగిన సజ్జల… మొన్నటి ఫీజు పోరు నిరసనలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేశారంటూ అందరినీ భుజం తట్టారట.

పార్టీనే కాకుండా రాజకీయాలనే వదిలేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా… సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్, ఇంకా చాలా మంది నేతలు సజ్జల తీరుతో పార్టీకి తీరని నష్టం జరుగుతోందని బహిరంగంగానే ఆరోపించిన సంగతి తెలిసిందే. నేరుగా సజ్జల పేరును వారు తీయకున్నా… జగన్ చుట్టూ చేరిన కోటరీ అంటూ సజ్జలను వారంతా సంబోధించారు. ఇవన్నీ జగన్ కు తెలియవని అనుకోవడానికి లేదు. ఎందుకంటే… 151 సీట్లతో బలీయంగా ఉన్న పార్టీ వై నాట్ 175 అంటూ ఎన్నికల్లోకి వచ్చి 11 సీట్లకు పరిమితమైన తర్వాత అయినా… దానికి కారణాలు ఏమిటన్న దానిపై ఆరా తీసి ఉంటారు కదా. అయినప్పటికీ ఇంకా సజ్జల టెలీ కాన్ఫరెన్సులు, పార్టీ కీలక సమావేశాలను నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే… సజ్జలను సైడ్ చేయడమో, ఆయనే సైడ్ కావడమో జరిగే పని కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Tags: #AndhraPolitics#AndhraPradeshPolitics#APElections#APpolitics#PoliticalNews#PoliticalStrategy#Sajjala#SajjalaRamakrishna#SajjalaRamakrishnaReddy#TDPvsYSRCP#ysjagan#Ysrcp#YSRCPLeader#YSRCPUpdates#YSRFamily
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ap:మంత్రి వర్గంలో మార్పులు నాగబాబు కేబినెట్ బెర్త్ ఖరారు

Next Post

 బాంబే హైకోర్టులో రవి ప్రకాష్ పరాజయం – మేఘాపై వేసిన పిటిషన్ కొట్టివేత!

Related Posts

#YadadriPowerPlant, #TelanganaPolitics, #BRS, #Congress, #KCR, #KTR, #KrishnaRiverWater, #GodavariRiver, #TelanganaWaterRights, #PalamuruRangareddy, #IrrigationProjects, #ThermalPowerPlant, #CoalImport, #Singareni, #PowerGeneration, #TelanganaGovernment, #PoliticalNews, #TelanganaAssembly, #PublicFunds, #TelanganaNews
Big Story

Telangana:కృష్ణా జలాల నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ ఘాటు విమర్శలు

#SriSathyaSaiDistrict, #ZPChairman, #ZillaParishad, #ParitalaSriram, #KethireddyVenkataKrishnaReddy, #VajraBhaskarReddy, #Mudigubba, #Kadiri, #Dharmavaram, #AndhraPradeshPolitics, #TDP, #YSRCP, #LocalBodyElections, #ZPTCElections, #PoliticalAnalysis, #AndhraPolitics, #DistrictPolitics, #ZPChairmanRace, #ElectionUpdates, #PoliticalNews
Big Story

ZPChairman:జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి? ముదిగుబ్బ నుంచే పరిటాల శ్రీరామ్, కేతిరెడ్డి పోటీనా?

AndhraPradeshPolitics
Big Story

AndhraPradeshPolitics:పల్లకీ మోసిన కార్యకర్తలకు పదవులు దక్కేనా?టికెట్ల పంచాయితీ.. కార్యకర్తలకు న్యాయం జరిగేనా?

#MunicipalElections, #APPolitics, #News7Telugu
Andhra Pradesh

MunicipalElections : ఏపీలో 106 మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వుడ్‌ పూర్తి జాబితా

karnataka
Big Story

karnataka:కంచె చేను మేస్తే.. న్యాయం ఎవరిని అడగాలి? కర్ణాటక నియామకాలపై ప్రశ్నలు

KadiriPolitics
Andhra Pradesh

KadiriPolitics:కదిరి రాజకీయ చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆనాటి నుంచి నేటి వరకు

Next Post
 బాంబే హైకోర్టులో రవి ప్రకాష్ పరాజయం – మేఘాపై వేసిన పిటిషన్ కొట్టివేత!

 బాంబే హైకోర్టులో రవి ప్రకాష్ పరాజయం – మేఘాపై వేసిన పిటిషన్ కొట్టివేత!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#Jailer2, #Jailer2MovieReview, #Jailer2Review, #Rajinikanth, #SuperstarRajinikanth, #NelsonDilipkumar, #AnirudhRavichander, #TamilCinema, #TeluguMovieReview, #MovieReview, #Jailer2TeluguReview, #Kollywood, #RamyaKrishnan, #YogiBabu, #SJSurya, #CinemaNews, #EntertainmentNews, #News7Telugu

Jailer2MovieReview : రజనీకాంత్ మాస్ అదుర్స్.. కథ ఎలా ఉంది?

#YadadriPowerPlant, #TelanganaPolitics, #BRS, #Congress, #KCR, #KTR, #KrishnaRiverWater, #GodavariRiver, #TelanganaWaterRights, #PalamuruRangareddy, #IrrigationProjects, #ThermalPowerPlant, #CoalImport, #Singareni, #PowerGeneration, #TelanganaGovernment, #PoliticalNews, #TelanganaAssembly, #PublicFunds, #TelanganaNews

Telangana:కృష్ణా జలాల నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ ఘాటు విమర్శలు

#SriSathyaSaiDistrict, #ZPChairman, #ZillaParishad, #ParitalaSriram, #KethireddyVenkataKrishnaReddy, #VajraBhaskarReddy, #Mudigubba, #Kadiri, #Dharmavaram, #AndhraPradeshPolitics, #TDP, #YSRCP, #LocalBodyElections, #ZPTCElections, #PoliticalAnalysis, #AndhraPolitics, #DistrictPolitics, #ZPChairmanRace, #ElectionUpdates, #PoliticalNews

ZPChairman:జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి? ముదిగుబ్బ నుంచే పరిటాల శ్రీరామ్, కేతిరెడ్డి పోటీనా?

AndhraPradeshPolitics

AndhraPradeshPolitics:పల్లకీ మోసిన కార్యకర్తలకు పదవులు దక్కేనా?టికెట్ల పంచాయితీ.. కార్యకర్తలకు న్యాయం జరిగేనా?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info