తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది. పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా సాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 23 తర్వాత రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని సమాచారం. ఈ నిర్ణయం రైతులకు గొప్ప ఊరటనిచ్చే అంశంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించగా, ఇకపై నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఈ సాయం అందనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను కూడా ఈ విడుదలలో జమ చేయనున్నారు.
అయితే, కొంతమంది రైతులకు ఈ సాయం ఇంకా అందలేదన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాలుగు ఎకరాలకు పైబడిన భూమి ఉన్న రైతులు ఈ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వారికి ఊరట కలిగించనుంది. తాజాగా మే 23 నుంచి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది.ఈ నెల 23నుంచి పెండింగ్ రబీ సీజన్ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. ఇప్పటిదాక మూడున్నర ఎకరాల వరకు రైతు భరోసా నిధులు రూ.4 వేల కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇక 4 ఎకరాలు ఆపైన ఉన్నవారికి పెట్టుబడి సాయం అందించనుంది.
4ఎకరాలు..ఆపైబడిన రైతులు 35లక్షల మంది వరకు ఉన్నారని..వారందరికి ఈ నెలాఖరులోగా రైతు భరోసా డబ్బులు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో రాళ్లు, రప్పలు, సాగుకు యోగ్యంకాని భూములు మినహాయించగా..కోటిన్నర ఎకరాల వరకు రైతు భరోసా వర్తించనుంది. ఇందుకు రూ.9వేల కోట్ల మేరకు కావాలని ప్రభుత్వం అంచనా వేసింది. రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ.12వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే.