కన్నడ భామ రుక్మిణి వసంత్ ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంటుంది. సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ ఆడియన్స్ మనసులు గెలిచిన ఈ అమ్మడు రీసెంట్ గా రిలీజైన కాంతారా చాప్టర్ 1 లో అదరగొట్టేసింది. సినిమాలో కనకావతి రోల్ లో రుక్మిణి తనకు వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంది. కాంతారా 1 తో అమ్మడు మరింత క్రేజ్ సంపాదించుకుంది. సినిమాలో ఆమె క్లిప్స్ ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు రుక్మిణి వసంత్ ఫ్యాన్స్.
స్టార్ హీరోయిన్ క్వాలిటీస్ అన్నీ ఉన్న రుక్మిణి తెలుగులో నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది. నెక్స్ట్ ఎన్టీఆర్ డ్రాగన్ లో అమ్మడు నటిస్తుంది. రుక్మిణి ఇప్పటికే తమిళంలో వరుస సినిమాలు చేస్తుంది. విజయ్ సేతుపతితో ఏస్, శివ కార్తికేయన్ తో మదరాసి సినిమాల్లో నటించింది అమ్మడు. ఐతే రుక్మిణి తన ఇంటర్వ్యూస్ లో ఎప్పుడు తనకు ఇష్టమైన హీరో ఎవరంటే ఆమె తమిళ స్టార్ సూర్య పేరు చెబుతూ వచ్చింది.
సూర్య సార్ అంటే చాలా ఇష్టం. ఆయన చేసిన లవ్ స్టోరీస్ చాలా ఇష్టమంటుంది అమ్మడు. రుక్మిణి అలా చెబుతున్న క్లిప్స్ ని సూర్య ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఎలాగు అమ్మడికి మంచి ఫాలోయిన్ వచ్చింది కాబట్టి ఆమెకు ఇష్టమైన హీరో సూర్యతో జత కట్టే ఛాన్స్ ఇస్తే బెటర్ అని అంటున్నారు. రుక్మిణి వసంత్ కూడా సూర్య తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు ఉంది.
ఇక తెలుగులో రుక్మిణికి చరణ్ అంటే ఇష్టమని చెప్పింది. సో ఇటు ఎన్ టీ ఆర్ తర్వాత అమ్మడు చరణ్ తో కూడా నటించే ఛాన్స్ లు ఉన్నాయి. ఏది ఏమైనా రుక్మిణి వసంత్ ప్రస్తుతం నేషనల్ ఆడియన్స్ అంతా తన మాయలో పడి ఊగిపోతున్నారు. తప్పకుండా అమ్మడికి ఇంకా చాలా మంది అవకాశాలు వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతాలు చేసేలా ఉందని చెప్పొచ్చు.
కాంతారా 1లో తన రోల్ కి పూర్తిస్థాయిలో న్యాయం చేసిన రుక్మిణి కోసం మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ రాసేందుకు అవకాశం ఇస్తుంది. అంతేకాదు లవ్ స్టోరీస్, కమర్షియల్ సినిమాల్లో నటించడం కూడా ఇష్టమని అంటుంది అమ్మడు. సౌత్ నుంచి నేషనల్ క్రష్ గా మారింది కన్నడ భామ రష్మిక మందన్న. ఐతే ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీ అయ్యింది. ఐతే రష్మిక తర్వాత నేషనల్ క్రష్ ట్యాగ్ ని రుక్మిణికి ఇచ్చేయాలని కొత్త నేషనల్ క్రష్ రుక్మిణి వసంత్ అని సోషల్ మీడియాలో ఒకటే హడావిడి జరుగుతుంది.