సాధారణంగా హీరో కైనా.. హీరోయిన్ కైనా ఒక్క పాత్ర చాలు వారి కెరియర్ ను అమాంతం మార్చేయడానికి.. అది నెగిటివ్ గా అయినా సరే.. పాజిటివ్ గా అయినా సరే.. అందుకే సెలబ్రిటీలు తమ పాత్రల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. అంతేకాదు ఆ పాత్ర సక్సెస్ అయితే తమకు తదుపరి అవకాశాలు వస్తాయని ఆలోచిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ఒక సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని.. ఆ పాత్ర తనకు మరిన్ని ఆఫర్లు తెచ్చి పెడుతుందని భావించింది. కానీ అనూహ్యంగా ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అమ్మడి ఆశలన్నీ ఆవిరి అయిపోయాయి. దీంతో చేసేదేమీ లేక తన తదుపరి సినిమాపై అంచనాలు పెట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి ఆమె ఎవరు? ఏ సినిమా ఆమె ఆశలపై నీళ్లు చల్లింది? ప్రస్తుతం ఏ పాత్ర పై ఆమె అంచనాలు పెట్టుకుంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు రుక్మిణి వసంత్.. కన్నడ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ అనే సినిమాతో అడుగుపెట్టింది. ఇటీవల నేరుగా నటించిన తెలుగు చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. తెలుగు సినిమా ఇదే అయినప్పటికీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.. ఇటీవల ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ‘మదరాసి’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె.. ఈ సినిమాపై ఎంతో ఆశలు పెట్టుకుంది. కానీ అనూహ్యంగా ఈ సినిమా డిజాస్టర్ అవడంతో అమ్మడి ఆశలు కాస్త ఆవిరిపోయాయి.
ప్రస్తుతం రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తున్న కాంతార చాప్టర్ వన్ సినిమాలో ఈమె నటిస్తోంది. అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ముఖ్యంగా విజువల్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. వీఎఫ్ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, హీరో నటన అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో రుక్మిణి వసంత్ యువరాణి పాత్రలో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ పాత్ర పైనే ఈమె ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ ట్రైలర్ చూస్తుంటే.. యువరాణి – గిరిజన యోధుడి మధ్య ప్రేమ ట్రాక్ తో వీరి మధ్య కథను రూపొందించినట్లు తెలుస్తోంది. పీరియాడికల్ ఫిలిం కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా తనకు మంచి గుర్తింపును అందిస్తుందని రుక్మిణి ప్రయత్నం చేస్తోంది. మరి రుక్మిణికి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
రుక్మిణి వసంత్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమాతో పాటు ‘కేజీఎఫ్’ చిత్రాలతో సంచలనం సృష్టించిన యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కూడా అవకాశం అందుకుంది. ఏది ఏమైనా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రుక్మిణి వసంత్ ఇప్పుడు ఈ పాత్ర పై ఎన్నో అంచనాలు పెట్టుకుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఈమెకు బ్లాక్ బస్టర్ అందిస్తుందని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.