టాలెంట్ తో పాటు, అందంతో కూడా ఆకట్టుకునే రుహానీ శర్మ, తాజాగా తన హాలీడే ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ రిసార్ట్ లో తీసుకున్న ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ కాగా. పూల్ సైడ్ దగ్గర గ్రీన్ బికినీ, కంఫర్టబల్ స్కర్ట్ వేసుకొని క్యూట్ స్టైల్‌ను హైలెట్ చేసింది. రుహానీ, తన గ్లామర్ లుక్‌తో ఫాలోవర్లను ఒకింత ఆశ్చర్యపరుస్తోంది.
ఇంత స్లీక్‌గా, క్లాస్‌గా ఉండే ఈ నటి… కొద్దిగా ట్రెడిషనల్ లుక్‌లోనే ఎక్కువగా కనిపించేది. కానీ ఈసారి మాత్రం వెకేషన్ మూడ్ లో ఫుల్ ఆన్ మోడర్న్ లుక్‌తో ఫోజులిచ్చింది. పెద్ద రిసార్ట్‌లో ఉదయం పక్షుల కిలకిలల మధ్య పూల్‌లో స్విమ్ చేస్తూ, గార్డెన్ నుంచి వచ్చిన ఫ్రెష్ ఆర్గానిక్ ఫుడ్‌ను ఆస్వాదించిన ఫీల్ ఆమె క్యాప్షన్లో కనిపిస్తోంది. “నా హృదయంలో ఒక భాగాన్ని అక్కడ వదిలి వెళ్ళాను అనుకుంటున్నాను.” అంటూ క్యాప్షన్ ఇచ్చిన రుహానీ ఫాలోవర్స్ ను ఆలోచింపజేసింది.
ఫొటోలు చూస్తేనే అర్థమవుతోంది.. ఆమె ట్రావెల్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ ఎంత క్లాసీగా ఉందో. ఎప్పుడూ కూల్ లుక్‌తో కనిపించే రుహానీ, ఇలా రెగ్యులర్ గా కాకుండా గ్లామరస్ అవతారంతో రావడం నెట్‌లో హీట్ పెంచేసింది. పూల్ పక్కన బెడ్‌పైన రిలాక్స్ అవుతూ, మిర్రర్ సెల్ఫీతో పర్ఫెక్ట్ హాలీడే మూడ్‌ను పిక్స్‌లో సెట్ చేసింది.
సినిమాల విషయానికి వస్తే… రుహానీ శర్మ ‘చి ల సౌ’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘హిట్’, ‘నట సమ్రాట్’, ‘కల్యాణవైభోగమే’, ‘ఇడా నమ్ముడు’ వంటి సినిమాల్లో నటించింది. గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే రుహానీ, తాజాగా వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ప్రాజెక్ట్‌ల పైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఈ బోల్డ్ లుక్స్‌తో ఇక మెయిన్‌స్ట్రీమ్ గ్లామర్ పాత్రలకూ డోర్ ఓపెన్ చేసిందనిపిస్తోంది.