జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ ‘దేవర’లో గ్లామరస్ పాత్రలోనే కనిపించింది. కానీ తంగ పాత్రలో నటనకు అంతగా స్కోప్ కనిపించలేదు. హీరోతో కాంబినేషన్ సన్నివేశాలు కూడా చాలా పరిమితంగానే ఉన్నాయి. అలా తారక్ తో జాన్వీకి రొమాంటిక్ సన్నివేశాలు చేసే ఛాన్స్ కు దూరమైంది. కానీ ‘పెద్ది’లో మాత్రం రామ్ చరణ్ తో రొమాన్స్ కి ఏమాత్రం కొదవలేదన్నది తాజా అప్డేట్. బుచ్చిబాబు కూడా రొమాంటిక్ డైరెక్టరే. హీరోయిన్లను అందంగా ఆవిష్కరించంలో దిట్టే అని తొలి సినిమా ‘ఉప్పెన’తోనే ప్రూవ్ చేసాడు.
కృతి శెట్టిని వెండి తెరపై అందంగా ఆవిష్కరించిన తీరుకు యువత ఫిదా అయింది. సినిమాలో హీరో-హీరోయిన్ మధ్య మాంచి రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుంది. ఇప్పుడా ఛాన్స్ పెద్దిలో కూడా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ‘పెద్ది’ షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. తాజా షెడ్యూల్ లో కొంత టాకీ తో పాటు ఓ పాట షూటింగ్ కూడా నిర్వహిస్తున్నారట. ఇది రామ్ చరణ్-జాన్వీకపూర్ మధ్య వచ్చే ఓరొమాంటిక్ మెలోడీ సాంగ్ అట. రెహమాన్ ఈ పాటను ఎంతో హృద్యంగాను డిజైన్ చేసాడట.
ప్రేమికుల మధ్య విరహ వేదనను పాటలో హైలైట్ చేయబోతున్నారట. మొత్తానికి ఈ మాస్ కంటెంట్ ఉన్న సినిమాలో రొమాంటిక్ గీతాలకు కూడా బుచ్చిబాబు పెద్ద పీట వేసినట్లు కనిపిస్తుంది. ఈ పాట విషయంలో బుచ్చిబాబు చాలా కాన్పిడెంట్ గా ఉన్నాడట. యువత హృదయాల్ని దోచేలా ఈ పాట ఉంటుందని భావిస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ లో రెహమాన్ భామగయ్యారు? అంటే అందుకు కారణం కేవలం బుచ్చిబాబు పట్టుదలతోనే. టాలీవుడ్ లో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా? వాళ్లందర్నీ కాదని మరీ చరణ్ ని ఒప్పించి రెహమాన్ కావాలని పట్టుబట్టి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం రెహమాన్ కూడా అంతే కసిగా పని చేస్తున్నారు. రెహమాన్ కూడా తెలుగు సినిమాకు సంగీతం అందించి చాలా కాలమవుతోంది. మధ్యలో వచ్చిన కొన్ని అవకాశాలు వదులుకున్నా పాన్ ఇడియా స్టార్ రామ్ చరణ్ చాన్స్ ను మాత్రం మిస్ చేసుకోలేదు. మ్యూజికల్ గా ఈ సినిమా సంచలనమవుతుందని అంచనాలైతే పీక్స్ లోనే ఉన్నాయి.