లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర (89) కన్నుమూశారు. వయుసు రిత్యా వచ్చిన అనారోగ్యంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. ఇండియన్ సినిమా మేటి నటుల్లో ఒకరిగా పేరుపొందారు ధర్మేంద్ర. షోలే సినిమా ఆయన కెరీర్ లో మైలురాయి.
1935 డిసెంబర్ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు ప్రకాశ్ కౌర్, హేమమాలిని. సన్నీ డియోల్, బాబీ డియోల్ తొలి భార్య సంతానం.
దిల్ బీ తేరా హమ్ బీ తేరే చిత్రంతో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర, తన కెరీర్‌లో “షోలే”, “చుప్కే చుప్కే”, “ధర్మ్ వీర్”, “సీటా ఔర్ గీత”, “యాదోం కి బారాత్” వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అభిమానులు ఆయనకు “హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్” అనే బిరుదు ఇచ్చారు.
కేంద్రప్రభుత్వం 2012లో పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
బాలీవుడ్ (Bollywood) సీనియర్ నటుడు (Senior Actor) ధర్మేంద్ర ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. పరిస్థితి విషమించటంతో 89 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. గత నెల 31న ఆయన ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. కానీ.. ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. దీంతో.. ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
ధర్మేంద్ర మరణవార్త తెలిసి రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము(Droupadi Murmu), ప్రధాని మోదీ (PM Modi) తదితర ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు నివాళులు (Tributes) అర్పిస్తున్నారు. ధర్మేంద్రతో ఉన్న మెమొరీస్‌ని షేర్ చేస్తున్నారు. ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న జన్మించారు. ఆయన 1954లో మొదటి వివాహం(ప్రకాష్ కౌర్‌తో), 1980లో రెండో పెళ్లి (సీనియర్ నటి హేమమాలినితో) (Hemamalini) చేసుకున్నారు. మొత్తం ఆరుగురు సంతానం.
1960లో నటుడిగా కెరీర్ ప్రారంభించి షోలే, ధర్మవీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దేశ్, డ్రీమ్ గర్ల్, అనుపమ, బందినీ, అన్‌పఢ్ తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో తన నటనకు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 2012లో పద్మభూషణ్ (PadmaBhushan) వరించింది. 2004లో బీజేపీ ఎంపీ(Bjp Mp)గా గెలిచి రాజకీయాల్లోనూ రాణించారు.
తన మాస్, యాక్షన్, రొమాంటిక్, కామెడీ చిత్రాలతో వరుస హిట్లు కొట్టి బాలీవుడ్ హీ మ్యాన్ అని పిలిపించుకున్నారు ధర్మేంద్ర. ఆరు దశాబ్ధాలకు పైగా కెరీర్‌లో 300కు పైగా సినిమాలలో నటించారు ధర్మేంద్ర. ఆయన నటించిన చిత్రాలలో 121 సినిమాలు ఘన విజయం సాధించాయి. ఈ ఘనత ఒక్క ధర్మేంద్రకే సొంతం. కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్, కోట్లాది రూపాయల ఆస్తులు, తీరిక లేని షెడ్యూల్స్‌తో సాగిపోతున్న దశలో హేమామాలిని రాక ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. రాజా జానీ, సీతా ఔర్ గీతా, షరాఫత్, నయా జమానా, పత్థర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, చరస్, షోలే, ఆజాద్, దోస్త్ తదితర సినిమాలలో ధర్మేంద్ర- హేమామాలిని కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లుగా హిందీ మీడియా కోడై కూసింది.
అప్పటికే ధర్మేంద్రకు పెళ్లయి పిల్లలు ఉండగా.. 1980లో హేమామాలిని మెడలో మూడు ముళ్లు వేశారు హీమ్యాన్. ఈ దంపతులకు ఈషా డియోల్, అహనా డియోల్ సంతానం. ధర్మేంద్రతో పెళ్లి, ఆ తర్వాత జీవితం గురించి తన జీవిత చరిత్ర హేమామాలిని: బియాండ్ ది డ్రీమ్ గర్ల్‌లో హేమామాలిని కీలక విషయాలు ప్రస్తావించారు. హేమ తల్లి జయ చక్రవర్తి.. ఒకప్పుడు ధర్మేంద్రకు బదులుగా జితేంద్రను పెళ్లి చేసుకోమని ఆమెపై ఒత్తిడి చేశారట. ధర్మేంద్రకు పెళ్లయి, నలుగురు పిల్లలకు తండ్రి కావడమే అందుకు కారణం. అలాగే పెళ్లయిన తర్వాత ధర్మేంద్రతో తాను ఎందుకు ఒకే ఇంట్లో కలిసి జీవించలేదో కూడా హేమామాలిని వివరించారు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. ధర్మేంద్ర ఇప్పటికే ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ధరమ్ జీ.. నా కోసం, నా కుమార్తెల కోసం ఏం చేసినా నేను సంతోషంగానే ఉన్నానని హేమ రాసుకొచ్చారు. అసాధారణ పరిస్ధితులు ఉన్నప్పటికీ.. తాను ఒంటరిని అని హేమ భావించలేదు. నేను అతనిపై నిఘా ఉంచాల్సిన అవసరం లేదు.. తండ్రిగా ఆయనకు బాధ్యతలు తెలుసు అని ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఏ మహిళ ఇలా జీవించాలని అనుకోరు.. కానీ నేను దాని గురించి బాధపడటం లేదు. నా పిల్లలని బాగానే పెంచాను అని ఓ ఇంటర్వ్యూలో హేమామాలిని తెలిపారు. తన దృష్టంతా ఎల్లప్పుడూ తన కుమార్తెలు ఈషా, అహానాలపైనే ఉండేది. ధర్మేంద్ర రోజువారీ ఉనికి లేకపోయినా తల్లిగా అన్ని చక్కదిద్దారు హేమామాలిని. భార్యలు ప్రకాశ్ కౌర్, హేమామాలిని వారి పిల్లలతో కుటుంబ ఐక్యతను కాపాడుకుంటూ వచ్చారు ధర్మేంద్ర. ఇంతకాలం కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ 89 ఏళ్ల వయసులో ఆయన తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో డియోల్ ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

















