తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలిచారు. అలా రెండో చోట పోటీ చేసినదే కామారెడ్డి అసెంబ్లీ సీటు. చిత్రమేంటి అంటే ఇక్కడ బీఆర్ఎస్ అధినేత అనాటి సీఎం కేసీఆర్ కూడా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇక్కడ బీజేపీ గెలించింది. ఇదిలా ఉంటే ఓడిన చోటనే గెలవాలని అక్కడ నుంచే బీసీలకు స్ట్రాంగ్ మేసేజ్ పంపాలని రేవంత్ భారీ ప్లాన్ వేసారు అని అంటున్నారు. అందుకే ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ అది కూడా బీసీ విజయోత్స సభని నిర్వహించేందుకు వేదికగా ఎంచుకున్నారని అంటున్నారు.
ఈ బీసీ సభను సూపర్ సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు, ఏఐసీసీ అధ్యక్షుడు అయిన మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను కూడా ఈ సభ కోసం ఆహ్వానిస్తున్నారు. అంతే కాదు నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా ఈ బీసీ సభను నిర్వహించేందుకు కామారెడ్డికి సమీపంలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని కూడా నిర్ణయించరని చెబుతున్నారు.
తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసమే బీసీ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. బీసీ ఓట్ బ్యాంక్ ని గుత్తమొత్తంగా కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ఇది కీలకం అవుతుందని భావిస్తున్నారు. ఇక్కడ కామారెడ్డిలోనే సభ ఎందుకు అంటే కాంగ్రెస్ 2023 ఎన్నికల ముందు కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభని నిర్వహించింది. అయితే ఇపుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో తాము డిక్లరేషన్ తో వదిలే రకం కాదని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని గట్టిగా ఒకటికి పది మార్లు చెప్పేందుకే ఈ బీసీ సభను నిర్వహిస్తున్నారు అని అంటున్నారు.
ఇక బీసీ సభను విజయవంతంగా నిర్వహించడంతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ కి తిరుగు ఉండదని భావిస్తున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లో ఎస్సీ ఎస్టీ వర్గారు మైనారిటీలు అగ్ర వర్గాలు ఉన్నారు. బీసీలను కూడా కలుపుకుంటే పటిష్టమైన ఓటు బ్యాంక్ తయారు అవుతుందని లెక్క వేస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి భారీ ప్లాన్ తోనే ఉన్నారు అని అంటున్నారు. కామారెడ్డి సభ తరువాత మొత్తం తెలంగాణా సామాజిక చిత్రం మారి రాజకీయంగా కాంగ్రెస్ కి మేలు జరుగుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.