శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈ సభను వేదికగా చేసుకొని బలహీన వర్గాలకు అనుమానం కలిగేలా గంగుల కమలాకర్ తప్పుడు సమాచారాన్ని ఇవ్వొద్దని కోరుతున్నా
మొదట బీసీల వివరాలు సేకరించే బాధ్యతను రాష్ట్ర బీసీ కమిషన్ కు అప్పగించాం
బీసీ కమిషన్ ద్వారా కాకుండా డెడికేషన్ కమిషన్ ద్వారా సమాచార సేకరణ జరగాలని … రాజ్యసభ సభ్యులు ఆర్. క్రిష్ణయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ ( రిట్ పిటిషన్ నెంబర్ 30381/2024) వేశారు.
పిటిషన్ విచారించి డెడికేషన్ కమిషన్ ను నియమించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది
హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం చిత్తశుద్ధితో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డెడికేషన్ కమిషన్ ను ఏర్పాటు చేశాం
బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు డెడికేషన్ కమిషన్ ద్వారా కుల సర్వే నిర్వహించాం
బీహార్, రాజస్థాన్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో చేస్తే అడ్డంకులు వచ్చాయని గంగుల కమలాకర్ గతంలో చెప్పారు
అలాంటి అడ్డంకులు తెలంగాణలో రాకూడదనే అధికారుల కమిటీని, మంత్రులను పంపించి ఇతర రాష్ట్రాలలో సమాచారాన్ని సేకరించాం
న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను పరిశీలించిన తరువాతనే డెడికేషన్ కమిషన్ ను నియమించాం
ఈ మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి 4, 2024 న మొదలుపెట్టి.. ఫిబ్రవరి 4, 2025 న పూర్తిచేశాం
365 రోజుల్లో పకడ్బందీగా చట్టాన్ని చేసి స్థానిక సంస్థల్లో బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
మంత్రివర్గ తీర్మానం చేసి శాసనసభలో ఆమోదించుకుని.. విద్య, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రెండు వేర్వేరు బిల్లులను గవర్నర్ కు పంపించాం
గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారు
5 నెలలుగా ఆ రెండు బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి
ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలపై కొందరు హైకోర్టుకు వెళ్లారు
సెప్టెంబరు 30 లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది
2018 లో ఆనాడు కేసీఆర్ తీసుకొచ్చిన చట్టం గుదిబండగా మారింది
అందుకే మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని గవర్నర్ కు పంపాం
గవర్నర్ గారు వీళ్ల మాటలు నమ్మి ఆ ఆర్డినెన్స్ ను కూడా రాష్ట్రపతికి పంపించారు
తెరవెనక లాబీయింగ్ చేసి రాష్ట్రపతికి పంపేలా చేశారు
ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదు కాబట్టి అత్యవసరమైతే ఆ బిల్లును ధరణ సభలో ఆమోదించుకుంటాం
ఇవాళ ఆ బిల్లును ఆమోదించుకుందాం అంటే ఏదేదో మాట్లాడుతున్నారు
42 శాతం రిజర్వేషన్లు ఇస్తే సంతోషంగా ఉండేవారిలో మొదటి వరుసలో గంగుల కమలాకర్ ఉంటానని స్పష్టంగా చెప్పారు
కానీ వాళ్ల నాయకులు సంతోషంగా ఉంటారని చెప్పడం లేదు
వాళ్ల నాయకులకు దుఃఖం, బాధ ఉన్నాయి.. కడుపునిండా విషం పెట్టుకుని ఉన్నారని కమలాకర్ స్పష్టంగా చెప్పారు
బీసీ కమిషన్ కు ఇచ్చిన జీవోనైనా, డెడికేషన్ కమిషన్ కు ఇచ్చిన జీఓనైనా… బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆకాంక్షతోనే
ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారు
అయిదుసార్లు ప్రధానికి లేఖ రాసి అపాయింట్ మెంట్ కోరినా ఇవ్వలేదు
అందుకే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపడితే దాదాపు 100 మంది వివిధ రాష్ట్రాల ఎంపీలు వచ్చి మద్దతు ఇచ్చారు
కానీ బీఅరెస్ రాజ్యసభ సభ్యులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు
అంటే బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ల పార్టీ నాయకుడు సిద్ధంగా లేరు.. వారికి చిత్తశుద్ధి లేదు
ఇవాళ కూడా సభలో గందరగోళం సృష్టించి బిల్లు ఆమోదం పొందకుండా అబద్ధాల ప్రాతిపదికన మాట్లాడుతున్నారు
ఇలాంటి వారికి కనువిప్పు కలగడానికి ఫిబ్రవరి 4 ను సోషల్ జస్టిస్ డే గా జరుపుకోవాలని నిర్ణయించాం
మీరు చేసిన తప్పులకు ఇప్పటికే ప్రజలు శిక్ష విధించారు.. అయినా మారకపోతే ప్రజలు మీకు ఆ హోదా కూడా మిగల్చరు.
వందేళ్లుగా చేయని పని మేం చేస్తే.. మమ్మల్ని అభినందించి ఉంటే కెసీఆర్ పెద్దరికం పెరిగి ఉండేది
వారేమో రారు… వచ్చిన వాళ్లు ఇలా ఉన్నారు
గంగుల కమలాకర్ ఈ ఒక్క విషయంలోనైనా వాళ్ల ఒత్తిడికి లొంగవద్దు
అది కల్వకుంట్ల కాదు.. కల్వకుంట
ఎవరినీ కలవనీయకుంట చూసే కుటుంబం అది
బలహీన వర్గాలు ఒకరినొకరు అవమానించుకుని ఇతరుల ముందు పలుచన కావొద్దు