ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి జరగడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యమంత్రి ప్రభుత్వ నివాసంలో బహిరంగ విచారణ జరుగుతున్న సందర్భంలో.. ఒక దుండగుడు ఆమెపై హత్యాయత్నం జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది.
సివిల్ లైన్స్‌లోని ఆమె అధికారిక నివాసంలో.. జరిగిన ప్రజా దర్బార్ సందర్భంగా.. ఆమె ప్రజలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో, ఒక్కసారిగా ఒక వ్యక్తి రాయిలాంటి వస్తువుతో.. రేఖ గుప్తా పై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఇక ఈ సంఘటన చోటు చేసుకున్న వెంటనే.. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి భద్రతా బృందం మొత్తం..అప్రమత్తమై.. ముందుగా స్థానిక ప్రజలు వెంటనే అక్కడి నుంచి పంపించేశారు. ఇక ఆ తరువాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో.. ఢిల్లీలో ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు.. చేసి.. పోలీసులు.. ఇప్పటికే ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
పబ్లిక్ హియరింగ్ సమయంలో..ఒక వ్యక్తి ఏదో కంప్లైంట్ ఇస్తూ ఉన్నట్టు.. ముఖ్యమంత్రి వద్దకు వచ్చాడు. కానీ అకస్మాత్తుగా అతను రాయిలాంటి వస్తువుతో ముఖ్యమంత్రిని కొత్త దానికి ఫ్రై చేశారు. అంతేకాకుండా వెంటనే అసభ్యకరమైన భాషతో దూషిస్తూ.. ఆమెపై దాడికి తెగబడ్డాడు.
ఇక పోలీసుల సమాచారం ప్రకారం..దాడి చేసిన వ్యక్తి వయస్సు దాదాపు 35 సంవత్సరాలు ఉందొచ్చని.. చేతిలో కొన్ని కాగితాలు ఉన్నాయని తెలిపారు. ఈ సంఘటన జరిగిన వెంటనే.. సంఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతేకాకుండా ఈ నిందితుడికి ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉందని కూడా..పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ దాడి గురించి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్పందించారు. అతను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ… “పోలీసులు విచారణ చేస్తున్నారు” అని తెలిపారు. త్వరలోనే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి నిజాలు బయటకొచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై షాకింగ్ దాడి జరిగింది. ఆమె అధికారిక నివాసంలో ప్రతి వారం జరుగుతున్న జనసున్వాయి కార్యక్రమం (ప్రజలతో ముఖాముఖి) సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఉదయం 9 గంటల సమయంలో రేఖా గుప్తా తన నివాసంలో ప్రజల సమస్యలు విన్నారు. విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ క్రమంలో 30 సంవత్సరాల వయసున్న రాజేష్ భాయ్ ఖీమ్జీ భాయ్ సకారియా అనే వ్యక్తి వినతిపత్రం ఇచ్చే నెపంతో ముందుకు వచ్చాడు. తన సమస్యలను వివరించిన తర్వాత అకస్మాత్తుగా సీఎం రేఖా గుప్తాపై దాడి చేశాడు.
మొదట ఆమె చెంపపై కొట్టడం, తర్వాత జుట్టు పట్టుకుని లాగడం జరిగింది. ఈ అనూహ్య పరిణామంతో అధికారులు, పోలీసులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. – దాడి వెనక కారణం ప్రాథమిక దర్యాప్తులో రాజేష్ భాయ్ గుజరాత్‌లోని రాజ్ కోట్ కు చెందిన వాడని పోలీసులు గుర్తించారు. అతని బంధువులలో ఒకరు జైలులో ఉన్నారని, అతన్ని విడుదల చేయాలని పిటిషన్‌తో ఢిల్లీకి వచ్చాడని సమాచారం. అతని వద్ద నుండి కోర్టు సంబంధిత పత్రాలు కూడా లభించాయి.
గుజరాత్ మీడియా నివేదికల ప్రకారం రాజేష్ భాయ్ ఒక జంతు ప్రేమికుడు. వీధికుక్కల సమస్యపై కోర్టు తీర్పు వెలువడిన తర్వాత అతను ఢిల్లీకి ప్రయాణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో కూడా పలుమార్లు ఢిల్లీకి వెళ్లినట్లు అతని తల్లి తెలిపినట్లు వార్తలు వెలువడ్డాయి. అంతేకాకుండా అతనికి మానసిక సమస్యలు ఉన్నట్లు సమాచారం. – అధికారుల స్పందన ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రికి తలకు గాయమైందని బీజేపీ వర్గాలు ఆరోపించాయి. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.