నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాదిలో ఇప్పటికే హిందీ మూవీ సికిందర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన త్వరలోనే మరో హిందీ మూవీ థామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అక్టోబర్ 21న విడుదల కాబోతున్న థామా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ముంబైలోని పలు కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు, ఈవెంట్స్‌కి రష్మిక మందన్న హాజరు అవుతోంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించినప్పటికీ రష్మిక మందన్న ను ముందు ఉంచి మరీ మేకర్స్ ప్రచారం చేస్తున్నారు. అందుకు కారణం ఆమె గతంలో చేసిన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం అనే విషయం తెల్సిందే. ధామా సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో రష్మిక మరింత యాక్టివ్‌గా ప్రచారం చేస్తోంది.
థామా సినిమా ప్రమోషన్‌లో భాగంగా రష్మిక మీడియా ముందుకు వెళ్లిన సమయంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రష్మిక మందన్న ఇటీవల విజయ్ దేవరకొండతో వివాహ నిశ్చితార్థం చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఇద్దరి ఫింగర్స్ కూడా ఎంగేజ్‌మెంట్ రింగ్స్‌తో మెరిసి పోవడం మనం సోషల్ మీడియాలో చూశాం. చాలా తక్కువ మంది సమక్షంలో వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. రష్మిక మందన్న అప్పుడే పెళ్లి కళతో వెలిగి పోతుంది అంటూ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆమె మీడియా ముందుకు వస్తే ఖచ్చితంగా నిశ్చితార్థం గురించిన ప్రశ్నలు రాకుండా ఉండవు. ఆ విషయం రష్మిక కి సైతం తెలుసు. ఆ విషయం గురించి పదే పదే గుచ్చి గుచ్చి అడుగుతారు అని తెలుసు. అయినా కూడా ఆమె మాత్రం ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చింది.
బాలీవుడ్ మీడియా వారు థామా సినిమా ప్రమోషనల్ మీడియా సమావేశం సందర్భంగా రష్మిక మందన్న ను సినిమా గురించి చాలా ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత రష్మిక మందన్న యొక్క వివాహ నిశ్చితార్థం గురించి, విజయ్ దేవరకొండ గురించి ప్రశ్నించారు. మీడియా వారు ఎంతగా ప్రశ్నించినా కూడా ఆమె మౌనంగానే ఉంది. సినిమా పీఆర్ టీం కొందరు మీడియా వారికి ముందుగానే రష్మికను నిశ్చితార్థం గురించి ప్రశ్నించవద్దు అని చెప్పారని తెలుస్తోంది. మొత్తానికి రష్మిక మందన్న మీడియా వారు ఎంతగా గింజుకున్నా కూడా ఎంగేజ్‌మెంట్ విషయమై నోరు విప్పలేదు. ఆ సమయంలో నిశ్చితార్థం వార్తలు కేవలం పుకార్లే అని కూడా ఆమె చెప్పలేదు. కనుక విజయ్ దేవరకొండతో ఆమె నిశ్చితార్థం నిజమే అని చాలా మంది మరింత బలంగా మాట్లాడుకుంటున్నారు. నిశ్చితార్థం గురించి బయటకు చెప్పకుండా దాయడం ఏంటో అర్థం కావడం లేదు అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. గీతా గోవిందం సినిమా సమయంలోనే వీరిద్దరి ప్రేమ వ్యవహారం మొదలైందని, ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరింతగా ప్రేమ కుదిరిందని టాక్. ఇద్దరి వ్యవహారం గురించి ఎన్నో సార్లు ఎన్నో పుకార్లు వచ్చాయి, కొన్ని ఫోటో సాక్ష్యాలు సైతం వచ్చాయి. కావాలని వారు లీక్ చేసినట్లుగా ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు నిశ్చితార్థ విషయాన్ని మాత్రం దాచి పెడుతూ వస్తున్నారు. ముందు ముందు అయినా వీరు పెళ్లి చేసుకుని అందరికి చెబుతారా లేదంటే అది కూడా రహస్యంగానే ఉంచుతారా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. మరో వైపు విజయ్ దేవరకొండ సైతం దిల్ రాజు బ్యానర్‌లో ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత అంటే వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి ఉంటుందేమో చూడాలి.