నేషనల్ క్రష్ రష్మిక మందన్న గత ఏడాది పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. పుష్ప 2 సినిమాతో రష్మిక పాన్ ఇండియా స్టార్‌డం మరింతగా పెరిగింది. దానికి తోడు అంతకు ముందు యానిమల్ సినిమా కారణంగా బాలీవుడ్‌లో సూపర్ హిట్ దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌లో రష్మిక మందన్న వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంది. కానీ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ రష్మిక బాలీవుడ్‌లో ముందుకు సాగుతుంది. సల్మాన్ ఖాన్‌తో చేసిన సికిందర్ సినిమా నిరాశ పరచినిప్పటికీ అంతకు ముందు వచ్చిన చావా సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రష్మిక మందన్న నటించిన చావా, సికిందర్, కుబేరా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
మూడు సినిమాల్లో ఛావా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సల్మాన్ ఖాన్‌తో నటించిన సికిందర్ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. సికిందర్ సినిమా రష్మిక మందన్న వరుస విజయాలకు బ్రేక్ వేసింది. అయితే సికిందర్ నిరాశ నుంచి కుబేర సినిమాతో రష్మిక బయట పడింది. కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, రష్మిక పాత్రకు మంచి స్పందన దక్కింది. ఈ ఏడాదిలో రష్మిక మందన్న నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే థామా. ఈ బాలీవుడ్ సినిమాపై రష్మిక ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ను కేవలం రష్మిక కోసం చూడాలి అనుకునే వారు చాలా మంది ఉన్నారు. అందుకే సినిమాను రష్మిక ను ముందు ఉంచి పబ్లిసిటీ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే సినిమాను ప్రమోట్ చేస్తున్నట్లుగా మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అక్టోబర్ 21న బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్ ఇతర సౌత్ భాషల్లోనూ విడుదల కాబోతున్న థామా సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న రెండు సినిమాలతో హిట్ కొట్టింది. ఈ సినిమా హిట్ అయితే రష్మిక ఖాతాలో మూడో హిట్ పడుతుంది. మరి రష్మిక ఆ మూడో హిట్‌ను సొంతం చేసుకుంటుందా అనేది తెలియాలంటే మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇదే ఏడాదిలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. కనుక వాయిదా వేశారా అనే చర్చ జరుగుతోంది. అది వాయిదా పడితే ఈ సినిమా ఈ ఏడాదికి రష్మిక నుంచి వచ్చే చివరి సినిమాగా చెప్పుకోవచ్చు. కనుక మూడో హిట్ ఈ సినిమాతో రష్మిక దక్కించుకుంటుందా అనేది చూడాలి.