ఉప్పెన తర్వాత రెండో సినిమానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఛాన్స్ అందుకున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. అందుకే వచ్చిన ఈ అవకాశాన్ని ఎక్కడ మిస్ యూజ్ చేసుకోకుండా ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. చరణ్ తో బుచ్చి బాబు చేస్తున్న పెద్ది సినిమా సంథింగ్ స్పెషల్ గా రాబోతుంది. రంగస్థలం తర్వాత చరణ్ మరోసారి ఒక పీరియాడికల్ కథతో అది కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి చికిరి సాంగ్ రిలీజ్ అవగా అది ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది.
పెద్ది సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సో సినిమా సాంగ్స్ తో కూడా హైలెట్ అయ్యేలా ఉంది. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ గా వచ్చిన చికిరి బ్లాక్ బస్టర్ అయ్యింది. రాబోతున్న నెక్స్ట్ సాంగ్స్ కూడా అందుకు తగినట్టుగానే ఉంటాయట. ఐతే చికిరి సాంగ్ లో చరణ్ స్టెప్పులు చూసి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ సాంగ్ రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంచుతున్నారు.
ఐతే చికిరి శాంపిల్ మాత్రమే అని.. ఇంకా సినిమాలో చరణ్ డ్యాన్స్ చేసే సాంగ్స్ ఉన్నాయని అంటున్నారు. చికిరి కాదు పెద్ది సినిమాలో అన్ని సాంగ్స్ లో చరణ్ చితక్కొట్టేశాడని చెబుతున్నారు. చికిరి సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ తో మేకర్స్ సూపర్ హ్యాపీగా ఉన్నా రాబోతున్న సాంగ్స్ మరింత సర్ ప్రైజ్ చేస్తాయని అంటున్నారు. చరణ్ డ్యాన్స్ తో పెద్ది సాంగ్స్ విజువల్స్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటాయని అంటున్నారు.
చరణ్ పెద్ది సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. రెహమాన్ మ్యూజిక్.. జతగా జాన్వి.. ఇక చరణ్ దూకుడిని ఆపేది ఎవరు చెప్పండి. చికిరి సాంగ్ తో ఆడియన్స్ అంతా సూపర్ హ్యాపీగా ఉండగా పెద్ది నుంచి నెక్స్ట్ వచ్చే సాంగ్స్ కూడా ఒక దానికి మించి మరొకటి అనిపించేలా ఉంటాయని అంటున్నారు. మరి పెద్ది కథ, కథనాలు ఒక లెక్క అయితే సాంగ్స్ లో చరణ్ చేసే డ్యాన్స్ హంగామా మరో లెక్క అనిపించేలా బజ్ ఉంది. ఇదంతా చికిరి సాంగ్ ఇచ్చిన జోష్ అని తెలుస్తున్నా చరణ్ సినిమా కాబట్టి ఆమాత్రం ఎక్స్ పెక్టేషన్స్ ఉండటంలో తప్పులేదని విశ్లేషకులు అంటున్నారు.
ఉప్పెన లో కూడా సాంగ్స్ విషయంలో బుచ్చి బాబు తన టేస్ట్ ఏంటో చూపించాడు. ఐతే స్టార్ హీరోతో కమర్షియల్ మూవీగా చేస్తున్న పెద్ది విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడని తెలుస్తుంది. మరి పెద్ది డ్యాన్స్ హంగామా థియేటర్ లో ఫ్యాన్స్ కి ఎలాంటి ఫీస్ట్ అందిస్తుంది అన్నది చూడాలి. రామ్ చరణ్ పెద్ది సినిమా 2026 మార్చి 27న రిలీజ్ లాక్ చేశారు.

















