భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ వసూళ్లు సాధించిన చిత్రమేది? అంటే అందరికీ గుర్తొచ్చేది `దంగల్`. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నితీష్ తివారీ తెరకెక్కించిన చిత్రం ఏకంగా 2000 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. అదీ ఒకే భాగంగా రిలీజ్ అయి అన్ని కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఇండియాలో వసూళ్ల కంటే? చైనా మార్కెట్ నుంచే 1300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇండియన్ మార్కెట్ నుంచి సాధించింది కేవలం 700 కోట్లు మాత్రమే. రెజ్లింగ్ నేథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో చైనా ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మరధం పట్టారు.
ఇండియన్ బాక్సాపీస్ లెక్కల పరంగా చూస్తే `బాహుబలి`, `పుష్ప` లాంటి చిత్రాలు భారీ వసూళ్లు సాధించిన చిత్రాలుగా కనిపిస్తున్నాయి. వాటి సంగతి పక్కన బెడితే? 2000 కోట్ల రికార్డును తిరగరాసేది మళ్లీ నితీష్ తివారీనేనా అంటే? అవుననే అనాలి. ప్రస్తుతం రణబీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో ఇతిహాసం `రామాయణాన్ని` రెండు భాగాలు గా తివారీ తెరకెక్కిస్తోన్న సంగి తెలిసిందే. ఈ సినిమా వందల కోట్లలో ఉంది. ఇప్పటికే మొదటి భాగం రామాయణం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా తొలి భాగం రిలీజ్ కానుంది.
మొదటి భాగానికి సంబంధించి పోస్ట్ ప్రడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ కథ కూడా విజువల్ ట్రీట్ గా హైలైట్ అవుతుందని నితీష్ చెప్పుకొచ్చాడు. రెండు సంవత్సరాల కష్టం రిలీజ్ అవుతుందని..తనకి కూడా లోలోపల టెన్షన్ ఉందన్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ స్టామినా ఎంత? 2000 కోట్ల వసూళ్లు రాబట్టే సత్తా ఉందా? అంటే అందుకు అవకాశాలు కనిసిస్తున్నాయి. `రామాయణం` అంటే భారత్ లోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ ఎంతే క్రేజ్ ఉంది. భారతీయ చారిత్రాత్మక అంశాలను ఆధారంగా చేసుకునే హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నారు.
`అవతార్` కథలకు స్పూర్తి భారతీయ పుస్తకాలే. భాగవతం, మహాభారతం వంటి వాటికి ప్రపంచ దేశాల్లో ఎంతోప్రత్యే కత ఉంది. అందులోనూ రాముడు..సీత..అంజనేయుడు..లంకేశ్వరుడు కథ అంటే? ఎంతో ఆసక్తిగానూ ఉంటుంది. ఆ కథకు విజువల్ ట్రీట్ ఇస్తోన్న చిత్రం కావడంతో? ప్రపంచ దేశాల్లో రామాయణం భారీ ఎత్తున రిలీజ్ ప్లానింగ్ రెడీ అవుతోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే దేశాల్లో ప్రత్యేకంగా రిలీజ్ చేయనున్నారు. మోదీ అధికారంలోకి రావడంతో భారతీయ హిందు సంప్రదాయాలు మరింత విశ్వవ్యాప్తమయ్యాయి. అది కూడా ఈ సినిమాకు ప్రధానంగా కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. మరి ఈ అంచనాలను రామాయణం అందుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.


















