గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ కోసం బుచ్చిబాబు అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడంతో షూటింగ్ చక చకా పూర్తవుతుంది. చరణ్ కూడా ఈ సినిమా కోసం తెగ కష్టపడుతూ బుచ్చిబాబుతో కలిసి పరుగులు పెడుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం పెద్ది షూటింగ్ నగర శివార్లలోని ఓ రైల్వే స్టేషన్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఈ సీన్స్ పూర్తయ్యాక నాసిక్ లో ఓ కీలక షెడ్యూల్ జరగనుంది. నాసిక్ షెడ్యూల్ లో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారనట. సినిమాలోని ఎంతో కీలకమైన క్లైమాక్స్ తో పాటూ మూవీలో ఎంతో ప్రధానంగా నిలిచే క్రికెట్ మ్యాచ్ సీన్స్ ను కూడా త్వరలో షూట్ చేయనున్నారని తెలుస్తోంది.
మొత్తం అక్టోబర్ నాటికి పెద్ది సినిమా షూటింగ్ ను పూర్తి చేసేలా బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ లో షూటింగ్ పూర్తి కాని పక్షంలో నవంబర్ నాటికైనా ఎట్టి పరిస్థితుల్లో పెద్ది షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయాలని బుచ్చిబాబు చూస్తున్నారు. ఈ సినిమాను బుచ్చిబాబు నెక్ట్స్ లెవెల్ లో తీస్తున్నారని ఇప్పటికే చాలా మంది చెప్పడంతో పెద్దిపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మొన్నా మధ్య సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ కు కూడా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది రిలీజ్ కానుంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.