టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కు ఇటీవలే లండన్ లో ప్రఖ్యాత మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని సైతం ఆవిష్కరించారు. అందుకోసం రామ్ చరణ్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి హాజరు కావడం జరిగింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని మైనపు విగ్రహాన్ని రామ్ చరణ్ స్వయంగా ఆవిష్కరించడం జరిగింది. అక్కడికి భారీ ఎత్తున కూడా అభిమానులు కూడ వచ్చారు. దీంతో రామ్ చరణ్ అందర్నీ ఎంతో ఆప్యాయంగా పలకరించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అయితే దీంతో అక్కడ అభిమానుల సైతం రామ్ చరణ్ ను ఉత్సాహపరిచేందుకు పెద్ది సినిమాకి సంబంధించిన గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ రావడంతో అందుకు చిహ్నంగా అభిమానులు పెద్ది చిత్రంలోని ఉపయోగించిన క్రికెట్ షాట్ బ్యాట్ ను సైతం అభిమానులు గిఫ్టుగా బహుకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మరింత విజయాన్ని అందుకోవాలంటూ అటు యూకే లండన్ అభిమానులు కూడా కోరుకుంటూ రామ్ చరణ్ కి ఈ బ్యాటని బహుమతిగా అందించారు. అంతేకాకుండా ఈ బ్యాట్ పైన రామ్ చరణ్ సిగ్నేచర్ కూడా కనిపిస్తూ ఉన్నది. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
డైరెక్టర్ బుచ్చిబాబు సన, జాన్వీ కపూర్ హీరోయిన్ గా,రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా పైన భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన చిన్న గ్లింప్స్ ఫస్ట్ షార్ట్ అనే పేరుతో విడుదల చేయగా రామ్ చరణ్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దీంతో ఒక్కసారిగా హైప్ పెరిగిపోవడమే కాకుండా ఎక్కడ చూసినా కూడా పెద్ది సినిమా గురించి చర్చలు జరిగేలా చేశారు. రామ్ చరణ్ ఫస్ట్ షార్ట్ సంబంధించి అక్కడక్కడ కొన్ని రీల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఆడియో రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడుపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమాతో డిజాస్టర్ నూట కట్టుకున్న రామ్ చరణ్ పెద్ది సినిమాతో సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.