రంగుల ప్రపంచంలో స్నేహాలు అన్నీ ఇలా వచ్చి పోయేవేనని అంటుంటారు. అవసరం తీరగానే మొహం చాటేసే స్నేహితులు ఉంటారు. కానీ అందుకు భిన్నమైనది ఈ స్నేహం. ఒకరికోసం ఒకరు.. ఏళ్ల తరబడి ఎంతో స్నేహంగా కుటుంబాలతో కలిసి జాలీగా గడపడం అందరిలో స్ఫూర్తి నింపుతోంది. సినీపరిశ్రమలో ఇది చాలా అరుదు. ఎప్పటికీ ఈ ఇద్దరు స్నేహితురాళ్లు తమ అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు.
ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాలా? రకుల్ ప్రీత్ సింగ్- ప్రగ్య జైశ్వాల్.. ఈ ఇద్దరూ టాలీవుడ్, బాలీవుడ్ లో కథానాయికలుగా కెరీర్ ని సాగిస్తున్నారు. వృత్తిరీత్యా ఇటు హైదరాబాద్, అటు ముంబై రెండు చోట్లా కలుస్తూనే ఉంటారు. కలిసి ప్రయాణాలు కూడా చేస్తుంటారు. ఆ ఇద్దరి మధ్యా స్నేహం అంత గొప్పగా కుదిరింది. ముంబైలో వీలున్నప్పుడల్లా తమ కుటుంబాలతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకునే ఫోటోలు వీడియోలను కూడా ఈ స్నేహితులు షేర్ చేస్తుంటారు. ఒకరి పనిని ఒకరు ప్రశంసిస్తూ సోషల్ మీడియాల్లో పోస్టులు షేర్ చేస్తుంటారు. అవన్నీ అభిమానుల్లోకి వైరల్ గా దూసుకెళుతున్నాయి.
ఇప్పుడు వినాయక చవితిని పురస్కరించుకుని బెస్ట్ ఫ్రెండ్స్ ఓ చోట కలిసారు. ఈ వేడుకలో రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానీతో కలిసి కనిపించగా, చిరు నవ్వులు చిందిస్తూ ప్రగ్య జైశ్వాల్, తన కుటుంబం, ఇతర స్నేహితులు ఫ్రేమ్ లో అందంగా ఒదిగిపోయారు. ఈ టీమ్ తో మృణాల్ కూడా చేరడంతో ఫ్రేమ్ కి మరింత అందం పెరిగింది. “ఈ సంవత్సరంలో అత్యంత శుభప్రదమైన.. ఉత్తమ సమయం ఇది.. గణపతి బప్పా మోరియో!“ అంటూ ఆహ్లాదకరమైన క్యాప్షన్ తో ఈ ఫోటోలను ప్రగ్య జైశ్వాల్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోగ్రాఫ్ లో రకుల్, ప్రగ్యలకు అత్యంత సన్నిహితురాలైన మంచు లక్ష్మి ప్రసన్న కనిపించకపోవడం లోటు! అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రకుల్, ప్రగ్య ఇద్దరూ చాలా బిజీగా ఉన్నారు. ప్రగ్య ప్రస్తుతం టాలీవుడ్ లో అఖండ 2లో నటిస్తోంది. బాలకృష్ణ సరసన వరస అవకాశాలు అందుకుంటోంది. టైసన్ నాయుడు అనే మరో పెద్ద చిత్రంలోను అవకాశం అందుకుంది. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన దే దే ప్యార్ దే 2లో నటిస్తోంది. రణబీర్ కపూర్ రామాయణంలో రకుల్ ప్రీత్ రావణుడి సోదరి శూర్పణఖగా నటిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తన పాత్ర గురించి రకుల్ ఎంతో ఎగ్జయిట్ అవుతోంది. వీటితో పాటు రకుల్ ప్రీత్ వెటరన్ నటి నీనా గుప్తాతో కలిసి `అమీరి` అనే కామెడీ సినిమాలో కనిపిస్తుంది.