పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొన్నటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు రాబోయే సినిమా మరొక లెక్క అనేలా తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ పై ముందునుంచి అంచనాలు గట్టిగానే పెంచారు. ఇక రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రొమాంటిక్ కామెడీతో పాటు హారర్ టచ్ కూడా కలిపి చూపించడం ఈ ట్రైలర్ ను స్పెషల్‌గా నిలిపింది. ప్రభాస్ లుక్, స్టైల్, డైలాగ్ డెలివరీ కాస్త కొత్తగానే ఉన్నాయి. డార్లింగ్ ను కామెడీ యాంగిల్ లో చూసి చాలా కాలమైంది. ఇక ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లాంటి హీరోయిన్స్ అందరూ స్క్రీన్ లో ఫ్రెష్ వైబ్ ఇచ్చారు. ఇక మహల్ కు సంబంధించిన రహస్యాలు దెయ్యం తాత గెటప్ లో సంజయ్ దత్ భయపెట్టనున్నట్లు తెలుస్తోంది. హారర్ కామెడీలో మంచి పట్టున్న మారుతి ఆ రూట్లో స్ట్రాంగ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసినట్లుగా అర్ధమవుతుంది. ఇక ముగ్గురు భామల మధ్య రొమాంటిక్ డోస్ తో పాటు పలు మాస్ అప్పీల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమోషనల్ గా బామ్మ సెంటిమెంటును కూడా జత చేసినట్లు అర్ధమవుతుంది. సినిమాలో ప్రధానంగా గ్రాఫిక్స్ బాగా ఇన్నట్లు హైలెట్ చేశారు. పొగ నుంచి వచ్చే దెయ్యాలు, వికృత రూపం, మొసలి అలాగే పెద్ద బల్లులు ఇలా గట్టిగానే విజువల్స్ ను చూపించనున్నట్లు అర్ధమవుతుంది. ఇక ఈ గ్రాఫిక్స్ పై ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. చివరలో తలకిందులుగా మహల్ లో రాజాసాబ్ గెటప్ లో ప్రభాస్ రోల్ డిఫరెంట్ గా ఉంది. ఆ క్యారెక్టర్ కూడా ఫోకస్ అయ్యేలా ఉంది. ప్రత్యేకంగా సాంగ్స్, హారర్ ఎలిమెంట్స్ మిక్స్ కావడంతో ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలా కనిపిస్తోంది. మొత్తానికి ది రాజాసాబ్ ట్రైలర్ ప్రభాస్ కెరీర్ లో కొత్తగా ప్రయత్నించిన ఎంటర్‌టైన్‌మెంట్ జానర్ ను చూపించింది. కామెడీ, రొమాన్స్, హారర్ అన్నీ కలిపిన ఈ సినిమా ట్రైలర్ పై ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లు ట్రైలర్ తో అఫీషియల్ గా మరో క్లారిటీ ఇచ్చేశారు. ఆ టైమ్ లో కంటెంట్ కాస్త క్లిక్కయినా కలెక్షన్స్ కు తిరుగుండదు. మరి మారుతి మ్యాజిక్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.