పుష్ప పుష్ప రాజ్ నీయవ్వ తగ్గేదేలే అంటూ ఇండియన్ బాక్సాఫీస్ పై తన మాస్ మేనియా చూపించాడు అల్లు అర్జున్. పుష్ప 1, 2 సినిమాలతో అల్లు అర్జున్ అదరగొట్టాడు. పుష్ప 1 తో మొదలు పెట్టి పుష్ప 2 తో మిగిలున్న రికార్డులను కొల్లగొట్టాడు. పుష్ప 2 తో ఆ కథ ముగుస్తుంది అనుకుంటే పుష్ప 3 రాంపేజ్ అంటూ సర్ ప్రైజ్ చేశాడు. పుష్ప సినిమాను ఒక ప్రాజెక్ట్ గా పూర్తి చేయాలని భావించిన సుకుమార్ కు రాజమౌళి రెండు భాగాలుగా రిలీజ్ చేయమని సలహా ఇచ్చాడు. అది కాస్త ఇప్పుడు 3వ భాగానికి దారి తీసింది.
ఐతే పుష్ప 3 సినిమా ఎప్పుడు ఉంటుంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈమధ్యనే మైత్రి నిర్మాత 2028 లో పుష్ప 3 ఉంటుందని అన్నారు. ఐతే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీ సినిమా లాక్ చేసుకున్నాడు. ఆ సినిమా హంగామా చూస్తుంటే హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గనట్టుగా ఉంది. సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. సో ఎలా లేదన్నా ఈ సినిమా 2 నుంచి 3 ఏళ్లు పట్టేలా ఉంది.
ఇక మరోపక్క అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా లైన్ లో ఉంది. ఇతిహాసాల నేపథ్యంతో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. ఐతే అది ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా అట్లీ సినిమా కన్ ఫర్మ్ అయ్యింది. ఆ సినిమా కూడా చాలా టైం తీసుకునేలా ఉంది. సో ఈ రెండు సినిమాలు పూర్తి చేసి కానీ పుష్ప 3 చేయాల్సి ఉంటుంది. ఐతే అట్లీ సినిమా పూర్తయ్యాక ఏమైనా పుష్ప 3 ని ముందుకు జరిపి త్రివిక్రం సినిమా నెక్స్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా అల్లు అర్జున్ సినిమాల లైనప్ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ ఫీస్ట్ అందించేలా ఉంది. పుష్ప 3 సినిమా కోసం మిగిలిన రష్ ఉన్నా కూడా మిగతా పార్ట్ షూట్ చేయాలన్నా కూడా టైం పట్టేలా ఉంది. మరి అల్లు అర్జున్ ప్లానింగ్ ఎలా ఉంది అన్నది చూడాలి.