డబుల్ ఇస్మార్ట్ తో మరో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి నెక్స్ట్ సినిమా అంత త్వరగా దొరుకుతుందని ఎవరు అనుకోలేదు. అందులోనూ కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి తో కాంబినేషన్ కుదుతుందని అసలు ఊహించలేదు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లెక్క కోసం సినిమాలు అసలు చేయడు. కథ నచ్చి అందులో క్యారెక్టరైజేషన్ పూర్తిగా ఎక్కితేనే అందులో తన విజువల్ ని ఊహించుకుని అప్పుడు సినిమాకు ఓకే చెబుతాడు. విజయ్ సేతుపతి సినిమా సైన్ చేశాడంటే సగం హిట్ అనే అనుకుంటారు.
అలాంటి విజయ్ సేతుపతి పూరీ జగన్నాథ్ తో బెగ్గర్ సినిమా చేయడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. పూరీ ఎలాంటి కథ చెబితే విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అని చర్చించుకుంటున్నారు. విజయ్ సేతుపతి టబు ఇలా బెగ్గర్ లో క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఐతే ఈ సినిమా విషయంలో పూరీ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్ తోనే పూరీ వస్తున్నాడట. బెగ్గర్ సినిమాను పూరీ జగన్నాథ్ న్యూ ఎనర్జీతో చేస్తున్నాడని తెలుస్తుంది. పూరీ తన ఒకప్పటి వర్కింగ్ స్టైల్ ఎనర్జీని కూడకట్టుకుని ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడట. అలా ఒకప్పటి పూరీని గుర్తు చేస్తే చాలని ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నారు. విజయ్ సేతుపతి సినిమాకు పూరీ ప్లానే అదని తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం బెగ్గర్ సినిమా రికార్డులు షేక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
పూరీ ఈమధ్య మ్యూజింగ్స్ తో ఆడియన్స్ కి కనెక్ట్ లో ఉన్నాడు. సినిమాలు ఫెయిల్ అయినా పూరీ మ్యూజింగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆ జోష్ తోనే పూరీ విజయ్ సేతుపతి సినిమాను తెరకెక్కిస్తున్నారట. తప్పకుండా ఈ మూవీ పూరీ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందని చెప్పొచ్చు. పూరీ కంబ్యాక్ ఇస్తే మాత్రం ఆడియన్స్ మాత్రమే కాదు స్టార్స్ కూడా ఖుషి అవుతారని చెప్పొచ్చు. మరి పూరీ నిజంగానే విజయ్ సేతుపతి బెగ్గర్ తో తిరిగి ఫాం లోకి వస్తాడా లేదా ఈమధ్య సినిమాల మాదిరిగానే హడావిడి తప్ప రిజల్ట్ అదే అని అనిపించుకుంటాడా అన్నది చూడాలి.