ఒక్క షాట్ తో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్.. కన్నుగీటుతూ కుర్రకారు హృదయాలపై బాణాలు సంధించింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే కుర్రకారుకు నేషనల్ క్రష్ అయిపోయింది అనడంలో సందేహం లేదు. అంతలా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నిలదొక్కుకోవడంలో కాస్త వెనకడుగు వేస్తోందనే చెప్పాలి. ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది . అందులో భాగంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోస్తూ ఫాలోవర్స్ ను ఆకట్టుకున్న ఈ చిన్నది .. అందులో భాగంగానే తాజాగా గ్రీన్ కలర్ చుడీదార్ ధరించింది. ఇందులో ఈమె తన ఎద అందాలను హైలెట్ చేస్తూ హాట్ ప్రదర్శన ఇచ్చింది. ఆ మెడను ఫుల్ ఫిల్ చేయడానికి ప్రత్యేకంగా డైమండ్స్ తో డిజైన్ చేసిన స్టెప్స్ హారాన్ని ధరించింది. ముఖ్యంగా ఈ హారం ఈమె అందాన్ని మరింత హైలెట్ చేస్తోందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ప్రియా ప్రకాష్ వారియర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ముఖ్యంగా ఆమె కళ్ళకు అభిమానులు ఫిదా అవుతున్నారు. కాటుక కళ్ళతో మళ్లీ మాయ చేస్తోంది ఈ చిన్నది అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు. ఏది ఏమైనా ప్రియా ప్రకాష్ వారియర్ షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయని చెప్పవచ్చు.
ప్రియా ప్రకాష్ వారియర్ విషయానికి వస్తే.. 1999 అక్టోబర్ 28న కేరళ పుంకున్నంలో జన్మించింది. ఈమె తండ్రి కేంద్ర ఎక్సైజ్ శాఖ ఉద్యోగి ప్రకాష్ వారియర్, తల్లి గృహిణి. త్రిసూర్ లోని సందీప్ విద్యానికేతన్ లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఈమె.. 2018లో త్రిసూర్ లోని విమల కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ కోర్సులో చేరింది. 2019లో వచ్చిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియా ప్రకాష్ వారియర్.. అందులో కన్ను గీటి ఓవర్ నైట్ లోనే వైరల్ అయిపోయింది..
అంతేకాదు 2018లో ఇండియాలో గూగుల్ ద్వారా అత్యధికంగా సెర్చ్ చేయబడిన నటిగా కూడా పేరు సొంతం చేసుకుంది.ఈమె తమిళ్ యాక్షన్ కామెడీ చిత్రమైన గుడ్ బ్యాడ్ అగ్లీలో కూడా నటించింది. 2021లో వచ్చిన తెలుగు చిత్రం చెక్ ద్వారా తెలుగు సినిమా తెరకు పరిచయమైన ఈమె ఇందులో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్ గా నటించగా.. తేనె పట్టుకొనే అమ్మాయి పాత్రలో నటించింది. అలాగే ఈ ఏడాది విష్ణుప్రియ అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం ఈమె చేతిలో మరో 2, 3 చిత్రాలు ఉన్నట్లు సమాచారం.