హాలీవుడ్ రేంజ్ కి ఎదిగిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీ వారణాసిలో హీరోయిన్ రోల్ పోషించిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా గ్లోబ్ ట్రోటర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో దేవకన్య లాంటి గెటప్ లో దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఈ ఈవెంట్ కి సాంప్రదాయమైన లుక్ లో ప్రియాంక చోప్రా ఎంట్రీ ఇవ్వడంతో చాలామంది ఆమె లుక్ కి ఫిదా అయ్యారు. అయితే ఈ లుక్ లో ఉన్న ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కూడా షేర్ చేసింది..
ఆ ఫోటోలను చూసిన చాలామంది అభిమానులు అద్భుతంగా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, రాజమౌళి ఇలా ఎంతోమంది తారలు వచ్చి సందడి చేశారు. వీరందరిలో ప్రియాంక చోప్రా తన డ్రెస్సింగ్ స్టైల్ తో సెంటరాఫ్ అట్రాక్షన్ గా కనిపించింది.
అనామిక ఖన్నా డిజైన్ చేసిన చీరలో ప్రియాంక చోప్రా సాంప్రదాయమైన లుక్ లో కనిపించింది. సాంప్రదాయమైన డ్రెస్ ఆమె అందాన్ని మరింత పెంచింది.. రామోజీ ఫిలిం సిటీలో చుక్కలే దిగివచ్చినట్లుగా ప్రియాంక చోప్రా ఆ లైట్స్ కింద తన మిరుమిట్లు గొలిపే అందంతో కనిపించి అభిమానులను ఫిదా చేసింది.
వైట్ క్రీమ్ కలర్ బ్లౌజ్ స్కర్ట్ తో పాటు అదే కలర్ లో ఉన్న దుపట్టా తో పెయిర్ చేసి దేవకన్యలా కనిపించింది. అంతేకాదు చేతికి కడియాలతోపాటు మెడలో పెద్ద చౌకర్, పాపిట బిళ్ళ, జడ బిల్లలు, నడుముకు వడ్డానం పెట్టుకొని తన లుక్ ని కంప్లీట్ చేసింది.అలా అచ్చ తెలుగు ఆడపిల్లలాగా ప్రియాంక చోప్రా ఈ ఈవెంట్లో మెస్మరైజ్ చేసింది. అంతేకాదు ఈ ఫోటోలకు క్యాప్షన్ గా నా లోపల దేవిని చానెలింగ్ చేస్తున్నాను # మందాకిని #వారణాసి అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా చేస్తున్న వారణాసి మూవీలో ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
రీసెంట్ గానే ప్రియాంక చోప్రా కి సంబంధించిన మందాకిని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రివీల్ చేశారు. ఇందులో శారీ కట్టుకొని గన్ చేతిలో పట్టుకొని యాక్షన్ మోడ్ లో ప్రియాంక చోప్రా కనిపించింది. అలా తాజాగా నిర్వహించిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో దేశ విదేశాల నుండి ఎంతోమంది అభిమానులు వచ్చి ఈవెంట్ ని సక్సెస్ చేశారు.


















