ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ తమ సినిమాలతోనే కాదు ఫ్యాషన్ దుస్తులతో కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సరికొత్త ఫ్యాషన్ దుస్తులతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అందులో భాగంగానే గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా కూడా సరికొత్త ఫ్యాషన్ దుస్తులతో దర్శనమిచ్చింది.
దివాళీ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈమె ధరించిన దుస్తులు మరింత అట్రాక్ట్ గా నిలుస్తున్నాయి. అందాలను చున్నీతో కవర్ చేస్తూ.. సిల్వర్ వైట్ కాంబినేషన్ లో చంకీలతో అత్యద్భుతంగా డిజైన్ చేసిన ఫాంట్, కోర్టు ధరించి ఉదర భాగాన్ని హైలెట్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది. తాజాగా ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. ఏది ఏమైనా ప్రియాంక చోప్రా ధరించిన ఈ సరికొత్త ఫ్యాషన్ దుస్తులు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.
ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. దర్శకుడు ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటికే తన పార్ట్ లో కొంత భాగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసింది. 2027లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం అటు ప్రియాంక చోప్రా కూడా గట్టిగానే కష్టపడుతున్నట్లు సమాచారం.
ప్రియాంక చోప్రా 1982 జూలై 18.. ఇండియన్ సినీనటి మాత్రమే కాదు మాజీ ప్రపంచ సుందరి కూడా.. ఇప్పుడు హాలీవుడ్ లో కూడా చిత్రాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది. తన నటన జీవితాన్ని ప్రారంభించక ముందు మోడల్గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకొని ప్రసిద్ధి చెందింది. 2002లో వచ్చిన తమిళన్ అనే తమిళ చిత్రం ద్వారా నటన జీవితాన్ని ప్రారంభించిన ఈమె ఆ తదుపరి సంవత్సరం అనిల్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై అనే చిత్రం ద్వారా బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది.
అదే ఏడాది రాజ్ కన్వర్ దర్శకత్వం వహించిన అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు సినీ పరిశ్రమలో తొలి విజయం లభించింది. ఈ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటి పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. అలా వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నప్పుడే కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల హాలీవుడ్కు వెళ్ళిపోయి అక్కడే సినిమాలు చేస్తూ భారీ క్రేజ్ దక్కించుకుంది. అంతేకాదు బాలీవుడ్లో ఒక్కో చిత్రానికి 45 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటూ అందరిని అబ్బురపరుస్తోంది ఈ ముద్దుగుమ్మ.