భారతదేశంలోని అన్ని చిత్ర సీమల్లోకన్నా తెలుగు సినీ పరిశ్రమ అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు, ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు తెలుగు సినిమాలను విపరీతంగా ఇష్టపడుతున్నారు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ఫ లాంటి పాన్ ఇండియా సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. దక్షిణ భారతదేశంలో అందులోను తెలుగు సినీ పరిశ్రమలో మన స్టార్ హీరోలు మిలియనీర్లుగా కొనసాగుతున్నారు. ఆస్తిపాస్తుల విషయంలో మిగతా హీరోలకు అందనంత దూరంలో వీరు ఉన్నారు. అంతేకాదు.. పలువురు స్టార్ హీరోలు సొంతంగా ప్రైవేట్ జెట్ విమానాలను కొనుగోలు చేశారు.
రజినీకాంత్ కు సొంతంగా ప్రయివేట్ జెట్ ఉంది. అత్యవసర పనులకు ఆయన దీన్ని వాడతారు. దేశవ్యాప్తంగా ప్రయాణం చేయడానికి, ఇతర పనులకు ఆయన దీన్ని ఉపయోగిస్తారు. మిగతా పనులకు మాత్రం కారును వాడతారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా జెట్ ను ఎక్కువగా వాడుతుంటారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఉండటం, వార్ 2 సినిమా చేస్తుండటంతో ప్రయాణాలకు జెట్ నే ఎక్కువగా వాడుతున్నారు. వ్యక్తిగత ప్రయాణాలకు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలకు కూడా జెట్ నే ఉపయోగిస్తున్నారు. మహేష్ బాబుకు కూడా సొంతంగా ప్రయివేట్ జెట్ ఉంది. సినిమా షూటింగ్స్ తోపాటు ఎండార్స్ మెంట్స్, ఈవెంట్లకు హాజరయ్యేందుకు దీన్ని వాడతారు. దీంతోపాటు భార్య, పిల్లలతో కలిసి విదేశాలకు వెకేషన్స్ కు వెళుతుంటారు. అలాంటి సమయంలో కూడా జెట్ ను వాడుతుంటారు.
అల్లు అర్జున్ జెట్ విమానాన్ని కొనుగోలు చేసి తన భార్య స్నేహారెడ్డికి బహుమతిగా ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి, అలాగే సరదాగా విహారయాత్రలకు వెళ్లేందుకు దీన్నే వాడుతుంటారు. అత్యవసర సమావేశాలు ఉన్నప్పుడు వెళ్లడానికి కూడా దీన్నే ఉపయోగిస్తారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అక్కినేని నాగార్జునకు కూడా ప్రయివేట్ జెట్స్ ఉన్నాయి. వారు సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తుంటారు. వ్యాపారాలు చూసుకోవడానికి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో వీరు జెట్ ను ఉపయోగిస్తారు.