తమిళ్ మూవీ ‘విరాట్టు’తో 2014లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమె మొదటి సినిమా కంచె అనుకుంటారు. కానీ అంతకు ముందు ఈమె మిర్చిలాంటి కుర్రాడు అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా విడుదల అయిన తర్వాతే క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కంచె’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కంచె సినిమా విడుదలైన వెంటనే ప్రగ్యా జైస్వాల్‌కి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కింది. ఆ సినిమాలో అందంతో పాటు నటనతో మెప్పించడంతో రాబోయే కాలంలో కాబోయే స్టార్ హీరోయిన్ అంటూ చాలా మంది ప్రగ్యాను ఆకాశానికి ఎత్తారు. కానీ ఆమెకు కాలం కలిసి రాలేదు.
కంచె సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్ చాలా సినిమాలు చేసింది. కానీ పెద్ద విజయాలను మాత్రం సొంతం చేసుకోలేక పోయింది. ఒక వేళ సినిమాలు సక్సెస్ అయినా ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. మొత్తంగా ప్రగ్యా జైస్వాల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌లను సొంతం చేసుకోలేదు, అంతే కాకుండా స్టార్ హీరోలకు జోడీగానూ సినిమాలో నటించే అవకాశాలు దక్కించుకోలేక పోయింది. సోషల్ మీడియాలో ఈమె రెగ్యులర్‌గా షేర్ చేసే ఫోటోల కారణంగా మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు దాదాపుగా మూడు మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. దాంతో ఈమె ఏ ఫోటోలు షేర్ చేసినా వైరల్ అవుతున్నాయి.
తాజాగా నేపాల్‌లోని ఖాట్మాండ్‌కి వెళ్లింది. అక్కడ తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. వైట్ టాప్‌ను ధరించి, బ్లూ టైట్ జీన్స్ను ధరించిన ప్రగ్యా జైస్వాల్ మరోసారి ఆకట్టుకుంది. తన గత ఫోటో షూట్స్ మాదిరిగానే ఈ ఫోటోలతోనూ ప్రగ్యా చూపు తిప్పుకోనివ్వడం లేదు. అందమైన ప్రగ్యా జైస్వాల్ అందమైన ప్రకృతి మధ్య ఫోటోలు దిగితే లైక్ చేయకుండా ఎలా ఉంటాం అంటూ చాలా మంది ఈ ఫోటోలకు తెగ లైక్ చేస్తున్నారు. ఈమె ఫోటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేల కొద్ది లైక్స్ నమోదు అయ్యాయి. మీరు చాలా అందంగా ఉన్నారు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ ప్రగ్యా అందాలపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్ చేస్తున్నారు.
1991లో జన్మించిన ఈ అమ్మడు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. పూణేలోని సింబియోసిస్ లా స్కూల్ నుంచి విద్యను పూర్తి చేసిన ఈమె సింబియోసిస్ విశ్వ విద్యాలయంలో చదివింది. ఆ సమయంలోనే మోడలింగ్‌పై ఆసక్తితో ఉంది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమా ఆఫర్లు దక్కించుకోలేక పోతున్న ఈమె ఇతర భాషల్లోనూ అడపా దడపా సినిమా ఆఫర్లు దక్కించుకుంటుంది. ప్రస్తుతం అఖండ 2 సినిమాలో నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ మరో వైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో టైసన్ నాయుడు సినిమాలోనూ నటిస్తున్న విషయం తెల్సిందే.