మొత్తం కెరీర్‌లో 30 సినిమాలు మాత్రమే చేసినా, ఆయన ప్రభావం మాత్రం 300 సినిమాలు చేసిన వారికీ అందని స్థాయిలో ఉంది.పవన్ కళ్యాణ్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు, మార్కెట్ అదిరిపోతుంది, పవన్ నిలబడితే చాలు బొమ్మ బ్లాక్ బస్టర్. ఇండియాలో మరొక హీరోకి సాధ్యం కాని క్రేజ్ ఇది.
అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి లెజెండ్స్ కూడా అందుకోలేని మ్యాజిక్‌ని పవన్ కళ్యాణ్ సృష్టించారు. అది ఆయన పొలిటికల్ 100 పెర్సెంట్ సక్సెస్‌కి ముందే సినీ చరిత్రలో రాసుకున్న అధ్యాయం.
ఇటీవలి OG సినిమా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్‌కి కొత్త డైమెన్షన్ ఇచ్చింది. ఇప్పటి Gen Z యువత కూడా ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, ఆ మెగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి ఫిదా అయ్యారు. ఫ్యాన్స్‌గా మొదలై, జనసైనికులుగా మారిపోతున్నారు.
జనరేషన్లకు అతీతంగా పవన్ పవర్ డబుల్ అవుతుందనడానికి OG సక్సెస్ నిదర్శనంగా నిలిచింది.