బుట్టబొమ్మ.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని.. బుట్టబొమ్మగా పేరు సొంతం చేసుకుంది పూజా హెగ్డే. తన నటనతో , అమాయకత్వంతో ఎంతోమంది అభిమానుల హృదయాలు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాదికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది పూజా హెగ్డే.
తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఈమె ఫోటోలు చూసిన అభిమానులు బుట్టబొమ్మ చాలా అందంగా ఉంది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవలే ముంబై ఎయిర్ పోర్టులో పాప రాజీలు ఈమెకు ప్రత్యేకంగా ముందస్తు బర్తడే వేడుకల్లో భాగంగా కేక్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె బర్తడే వేడుకలు కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను పూజా హెగ్డే షేర్ చేసింది.
అందులో స్లీవ్ లెస్ వైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన ఈమె అందంగా కేకు ముందు ఫోటోలకు ఫోజులిచ్చింది. పైగా ఈమె పేరులోని షార్ట్ అక్షరాలు పిహెచ్ (పూజా హెగ్డే) అక్షరాలతో చాలా అందంగా డిజైన్ చేసిన కేక్ టేబుల్ పై ఉండగా.. ఆ కేకును చూస్తూ మురిసిపోతున్నట్టు ఫోటోలు పంచుకుంది. ప్రస్తుతం బుట్ట బొమ్మ షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే బుట్ట బొమ్మ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమ్మడికి సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఫోటోలు చూసి లవ్ ఎమోజీలతో పాటు ఫైర్ ఎమోజీలను కూడా షేర్ చేస్తున్నారు.
పూజా హెగ్డే కెరియర్ విషయానికి వస్తే.. నాగచైతన్య హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె.. స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ముకుంద , దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురంలో , సాక్ష్యం, అరవింద సమేత, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. రంగస్థలం, ఎఫ్ 3, కూలీ వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్ లతో కూడా అలరించింది. ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దళపతి జననాయగన్ చిత్రంతోపాటు రాఘవ లారెన్స్ తో కలిసి కాంచన 4 లో కూడా నటిస్తోంది. అంతేకాదు హై జవానీ తో ఇష్క్ హోనా హై అనే హిందీ సినిమాలో కూడా నటిస్తోంది పూజా హెగ్డే. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈమెకు కనీసం ఈ కొత్త సినిమాలైనా హిట్ అందిస్తాయో లేదో చూడాలి.