బీజేపీ జాతీయ అధ్యక్షుడు అంటే నామమాత్రంగా కాకుండా పార్టీ ఫస్ట్ అన్నట్లుగా ఉండాలన్నది ఆర్ఎస్ఎస్ బలమైన అభిప్రాయంగా ఉంది. పార్టీ గొప్పది అని తెలియాలి అంటే అధ్యక్షుడు స్ట్రాంగ్ గా ఉండాలన్నది కూడా ఆర్ఎస్ఎస్ అందుకోసం ఆర్ఎస్ఎస్ భారీ కసరత్తు చేస్తోంది అని అంటున్నారు. బీజేపీ జాతీయ ఆధ్యక్షుడిగా ఇంకా ఎవరినీ నియామకం చేయకపోవడం వెనక చాలానే జరుగుతోంది అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం 2024 జనవరితో పూర్తి అయింది. ఇపుడు చూస్తే దాదాపుగా రెండేళ్ళుగా ఆయనే కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో ఎవరికి తీసుకుని రావాలన్న దాని మీద అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు అన్నది ప్రచారంలో ఉన్న మాట.
బీజేపీ కొత్త ప్రెసిడెంట్ ఎంపిక అన్నది ఆర్ఎస్ఎస్ చాయిస్ గానే ఉంటుందని చెబుతున్నారు. బీజేపీ వ్యవహారాలలో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఈ మధ్యనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆచరణలో మాత్రం అలా జరిగే అవకాశాలు ఎంత మాత్రం లేవనే అంటున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి మార్గదర్శకత్వం చేయడమే కాకుండా కొత్త ప్రెసిడెంట్ విషయంలో తన మాట నెగ్గించుకుంటుందని అంటున్నారు. వ్యక్తుల కంటే సంస్థ గొప్పది పార్టీ గొప్పది అన్నదే ఆర్ఎస్ఎస్ విధానం. అందుకే తమ వారినే బీజేపీ పీఠం మీద కూర్చోబెట్టాలని ఆర్ఎస్ఎస్ చూస్తోంది అని అంటున్నారు.
బీజేపీలో ప్రెసిడెంట్ పవర్ ఫుల్ గా ఉండాలన్నది ఆర్ఎస్ఎస్ విధానంగా చెబుతున్నారు ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాలకు ధీటుగానే ఉండాలని ఆశిస్తున్నారు. అంతే తప్ప రబ్బర్ స్టాంప్ మాదిరిగా ఉండరాదు అన్నది పట్టుదలగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ తన వంతుగా భారీ కసరత్తు చేస్తోంది అని అంటున్నారు. అలా ఆర్ఎస్ఎస్ చాయిస్ గా సంజయ్ జోషీ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ సంజయ్ జోషీ ఎవరూ ఏమిటి అన్నది చూస్తే కనుక ఆయన మహారాష్ట్రకు చెందిన వారు. 1990 ప్రాంతంలో జోషి మోడీ జట్టు బీజేపీని గెలిపించేందుకు గుజరాత్ లో బలంగా పనిచేసింది. అలా గుజరాత్ లో బీజేపీకి తిరుగులేని పునాది వేసింది ఇప్పటి మూడున్నర దశాబ్దాలుగా బీజేపీ అక్కడ రాజ్యం చేస్తోంది అంటే ఈ ఇద్దరు కృషి కారణం అని చెబుతారు.
అయితే ఆ తర్వాత కాలంలో సంజయ్ జోషీతో మోడీకి విభేదాలు తీవ్ర స్థాయిలోనే వచ్చాయని అంటారు. అలా ఆయన బీజేపీలో ఎక్కడో వెనకబడిపోయారు. అలాంటి సంజయ్ జోషీని తెచ్చి బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠం మీద పెట్టాలని ఆర్ఎస్ఎస్ చూస్తోంది అని ప్రచారం సాగుతోంది. అదే కనుక జరిగితే దానికి మోడీ ఎంతవరకు అంగీకరిస్తారు అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం కరడు కట్టిన ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి బీజేపీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి డెవలప్ చేసే నాయకత్వం అవసరం అని భావిస్తోందిట.
ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్ ఈ విధంగా ఆలోచిస్తూ ముందుకు సాగుతూంటే కొత్త బీజేపీ ప్రెసిడెంట్ విషయంలో మోడీ షా అయితే వీలైనంతవరకూ జాప్యం చేస్తున్నారు అన్న ప్రచారమూ సాగుతోంది నిజానికి ఆర్ఎస్ఎస్ ప్రమేయం లేకుండా బీజేపీ దేశంలో సొంతంగా ఎదగాలని 2024 ఎన్నికల వేళ బీజేపీ పెద్దలు తలచారు అని అంటారు. ఆ విధంగా 400 ప్లస్ ఎంపీలు అంటూ బీజేపీ ఒక భారీ లక్ష్యం పెట్టుకుని మరీ ఎన్నికల గోదాలోకి దిగితే కనీసం మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా కూడా సీట్లు దక్కలేదు. అప్పట్లో అయితే ఆర్ఎస్ఎస్ అవసరం లేకుండానే తాము మంచి పెర్ఫార్మెన్స్ చేయగలమని నడ్డా కూడా మాట్లాడారని చెబుతారు. ఎపుడైతే 2024 ఎన్నికల్లో బీజేపీ దెబ్బ తిన్నదో మళ్ళీ ఆర్ఎస్ఎస్ తో సయోధ్యకు వచ్చింది అని అంటారు. దాంతో బీజేపీ వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ ప్రమేయం బాగా పెరుగుతోంది. దాంతో కొత్త అధ్యక్షుడు కచ్చితంగా ఆర్ఎస్ఎస్ మనిషి ఉండి తీరుతారు అని అంటున్నారు.
తమ చాయిస్ గా ఆర్ఎస్ఎస్ సంజయ్ జోషీని ముందు పెడుతోంది. అధ్యక్ష పదవి ఆయనే ఇవ్వాలని పట్టుబడుతోంది. ఒక వేళ అలా కాదూ కూడదు అనుకుంటే ప్రధాన కార్యదర్శిగా అయినా ఆయనను ఉంచాలని చూస్తోంది. మరి ఈ విషయంలో మోడీ షాలు ఏమి ఆలోచొస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఆర్ఎస్ఎస్ నుంచి అత్యంత బలమైన సంఘీయుడే రేపటి బీజేపీ ప్రెసిడెంట్ అవుతారని ఒక విధంగా పార్టీ ఫస్ట్ గా చాటుతూ ప్రభుత్వాన్ని కూడా నియంత్రించే వారే ఉంటారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
 
			



















