దేశం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే అతి కొద్దిమంది నేతల్లో మోడీ ముందు వరుసలో ఉంటారు. రైల్వే ఫ్లాట్ ఫాం మీద టీ అమ్మిన క్షణం నుంచి చివరకు భారతదేశంలోనే అత్యున్నత స్థానానికి చేరుకోవటమే కాదు.. ముచ్చటగా మూడుసార్లు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. విషయం ఏదైనా సూటిగా.. స్పష్టంగా.. సుత్తి లేకుండా చెప్పే తీరు ఉన్న మోడీకి తనను ప్రశ్నించే వారన్నా.. తనను సందేహంగా చూసే వాళ్లను అస్సలు ఇష్టపడ్డరన్న మాట మోడీ గురించి తెలిసినోళ్లంతా చెబుతుంటారు. అలాంటి మోడీసాబ్ మీద నింద ఒకటి పడటం తెలిసిందే,
ఆయన అప్పుడెప్పుడో పూర్తి చేసిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను పంచాయితీగా చేయటమే కాదు.. వాటిని బయటపెట్టాలని.. అధికారికంగా చూపించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఉదంతం గురించి తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ తాజాగా కోర్టు నుంచి వెలువడింది. నీరజ్ అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి చేసిన డిగ్రీ కోసం సమాచార హక్కు చట్టం కింద సీఐసీకి అప్లికేషేన్ పెట్టటమే కాదు.. మోడీ మాష్టారి గ్రాడ్యుయేషన పట్టాను చూపించాలని కోరుతున్నారు.
అయితే.. ఈ వాదనకు కౌంటర్ గా కొత్త పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ వివరాల కోసం పెట్టిన అప్లికేషన్ కు సంబంధించి కోరిన వివరాల్ని వెల్లడిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 1978లో బీఏ పూర్తి చేశారని.. ఆ ఏడాది బీఏ పరీక్షలో పాస్ అయిన వారి రికార్డుల తనికీకి 2016 డిసెంబరులో ప్రధాన సమాచార కమిషనర్ అనుమతించారు. ఈ అంశాన్ని సవాలు చేయగా.. 2017లో ఢిల్లీ హైకోర్టుకు ఆ వివరాలు బయటకు వెల్లడి కాకుండా ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది,
వివరాలు తెలుసుకునే కన్నా.. వ్యక్తిగత గోప్యతా పరిరక్షణ హక్కు మిన్నగా పేర్కొంటూ.. సీఐసీ ఉత్తర్వులను కట్టేయాలని కోరుతూ ఢిల్లీ వర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ప్రధాని డిగ్రీ వివరాల్ని కోర్టుకు అందించేందుకు సంబంధిత వర్సిటీ సిద్ధంగా లేరని.. ఆర్టీఐ కింద ఈ వివరాల్ని అపరిచుతులతో పంచుకునేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. కాసేపు కోర్టులు.. ఇతర సంస్థలకు చెందిన కమిషన్లు.. వారి ఆదేశాల్ని పక్కన పెట్టేద్దాం. అన్నింటిని త్యజించిన మోడీ లాంటి ప్రధానమంత్రికి సంబంధించి దారిన పోయే దానయ్యకు అనుమానం వచ్చి ప్రశ్నిస్తే.. నవ్వుతూ మరో ఆలోచన లేకుండా డిగ్రీని అడిగితే.. ముఖం మీద లాగి ఒక్కటి ఇచ్చినట్లుగా ఆ వివరాల్ని అందిస్తే సరిపోయేది.
అందుకు భిన్నంగా కోర్టులు.. కేసులు.. వాదనలు.. లాంటి వాటితో సాధించేది ఏమిటి? అన్నింటికి మించి అనుమానం వచ్చినప్పుడు దాన్నితీర్చస్తే సరిపోతుంది. ఈ చిన్న విషయాన్ని మోడీ మాష్టారు ఎందుకు మిస్ అవుతున్నట్లు..? అయినా.. ఆయన్ను అడిగింది.. సందేహాన్నివ్యక్తం చేసింది ఆయన పాలనలో బతుకు బండిని లాగే సామాన్యుడికే కదా? తన వాళ్లకు తన డిగ్రీ చూపించటంలో తప్పేముంది? సర్టిపికేట్లు అక్కర్లేదు.. ఈ సందేహాలకైనా సమాధానాలు చెప్పేస్తారా మోడీజీ?