ఏపీ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ యువశక్తి ఉందని నొక్కిచెప్పారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏపీకి సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. 16 నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజిన్‌లా దూసుకుపోతోందని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
అభివృద్ధి కోసం ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇవాళ(గురువారం) కర్నూలు జిల్లాలోని నన్నూరులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్’ బహిరంగసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ఈ సభలో సోదర, సోదరీమణులకు నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగించారు. అహోబిళం, మహానంది, మంత్రాలయం స్వాముల ఆశీస్తులు కోరుకుంటున్నామని ఆకాంక్షించారు. ద్వితీయ జ్యోతిర్లింగమైన మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందానని చెప్పుకొచ్చారు. సోమనాథుడు కొలువైన గడ్డపై పుట్టానని ఉద్ఘాటించారు. విశ్వనాథుడికి సేవ చేసే భాగ్యం కలిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.
2047 నాటికి మన దేశం వికసిత్ భారత్‌గా మారుతుంది. 21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం. ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది. ప్రాజెక్టులతో పరిశ్రమలకు ఊతం.. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దేశం అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం. ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులతో దేశ ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుద్దీకరణ జరిగింది. తలసరి విద్యుత్ వినియోగం 1400 యూనిట్లకు పెరిగింది. దేశంలో ఇంధన విప్లవానికి ఏపీ కేరాఫ్‌గా మారింది. ఇళ్లతో పాటు పరిశ్రమలకు తగిన విద్యుత్ అందుతోంది. సహజ వాయువు పైప్‌లైన్‌తో రూ.15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా. చిత్తూరు LPG బాటిలింగ్ ప్లాంటుకు రోజూ 20 వేల సిలిండర్లు నింపే సామర్థ్యం ఉంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన మోదీకి ఏపీ తరపున ధన్యవాదాలు తెలిపారు.
బ్రిటీష్‌వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ పుట్టిన పౌరుష గడ్డ 25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఇవాళ(గురువారం) కర్నూలు జిల్లాలోని నన్నూరులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్’ బహిరంగసభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
చాలా మంది ప్రధానులతో పనిచేసినా.. మోదీ వంటి నేతను చూడలేదని అభివర్ణించారు. ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం మోదీ పనిచేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని ఉద్ఘాటించారు. మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరామని వివరించారు. ఆపరేషన్ సిందూర్.. మన సైనిక బలం నిరూపించిందని కొనియాడారు. మాటలతో కాదు.. చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓ నిజమైన కర్మయోగిగా చూస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అని ప్రశంసించారు. ఇవాళ(గురువారం) కర్నూలు జిల్లాలోని నన్నూరులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్’ బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. మోదీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారని కొనియాడారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకువచ్చారని కీర్తించారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకుని మనం నిలబడాలని పవన్ కల్యాణ్ సూచించారు.
దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధాని మోదీ ఓ నిజమైన కర్మయోగి అని మోదీ కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదని.. రెండు, మూడు తరాల ప్రజలకు దిశా నిర్దేశం చేస్తున్నారని కొనియాడారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెడుతున్నారని ప్రశంసించారు. గూగుల్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులు దేశానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చాయని ఉద్ఘాటించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. జీవిత, ఆరోగ్య బీమాతో సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గటంతో ప్రజలు ఆదా చేసుకోగలుగుతారని వివరించారు. కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. పెట్టుబడులు పరిశ్రమల నమ్మకాన్ని సడలించకుండా అంతా కలిసే ఉండి స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలంలో పర్యటించారు. అయితే.. ఆయన వెంట ఆద్యంతం సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఉన్నారు. తొలుత కర్నూలు నుంచి హెలికాప్టర్‌లో భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ నుంచి బయలుదేరి నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వైపు పయనమయ్యారు. నంది మండపం సర్కిల్ నుండి గంగాధర మండపం వరకు మార్గమంతా దాదాపు 8,000 మంది శివసేవకులు కాషాయ వస్త్రధారణలో నిలబడి హర హర మహాదేవ అంటూ ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు.
దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణాకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. అనంతరం మొదట ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం, అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూలవిరాట్ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, మహా మంగళ హారతి, మంత్రపుష్పాలతో భక్తిశ్రద్ధలతో దర్శనం చేశారు.
అనంతరం సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికాగుండం వద్ద స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి భ్రమరాంబ అమ్మవారి ముఖ మండపంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీ చక్రానికి ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించి, షోడశోపచార పూజలు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు. తరువాత వేదాశీర్వచన మండపంలో వేద పండితులు చతుర్వేద ఆశీర్వచనం చేసి, అమ్మవారి తీర్థప్రసాదాలను ప్రధానమంత్రికి సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రికి స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు, శేష వస్త్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపరాష్ట్రపతి పవన్ కళ్యాణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్తిగా ప్రధాని వెంటే ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు పూజల్లో పాల్గొనకుండా.. ఆయనను అనుసరించడం విశేషం. కాగా.. ఈ పర్యటనలో బీజేపీ నాయకులు ఎవరూ లేకపోవడం గమనార్హం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీలోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి నారా లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”నువ్వు కూడా మీ నాన్నలా తయారువుతున్నావే!” అని వ్యాఖ్యానించారు. తొలుత ఢిల్లీ నుంచి కర్నూలు జిల్లాలోని ఓవర్వకల్లు విమానాశ్రయానికి వచ్చిన ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నుంచి ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కూడా విమానాశ్రయానికి చేరుకుని ప్రధానికి స్వాగతం పలికారు. అయితే.. సీఎం , డిప్యూటీ సీఎం, బీజేపీ చీఫ్ మాధవ్‌కు వెనుకాల నిలబడ్డ నారా లోకేష్‌ను ప్రధాని స్వయంగా దగ్గరకు తీసుకున్నారు. చేతిలో చేయి వేసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన నారా లోకేష్ వెయిట్ బాగా తగ్గుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో చూసినప్పటికీ.. ఇప్పటికీ.. స్మార్ట్‌గా ఉన్నారని అన్నారు.
ఈ సందర్భంగా పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని.. ప్రతిరోజూ.. వర్కవుట్‌లు చేస్తున్నార ని వివరించారు. మీ నుంచి స్ఫూర్తి పొంది.. యోగా, ప్రాణాయామం వంటివి ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు.. నీరు ఎక్కువగా తీసుకుని.. తృణధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. మొత్తంగా నారా లోకేష్ గురించి రెండు నిమిషాల్లో వివరించారు. ఈ క్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. “ఇలానే చేస్తే.. త్వరలోనే నువ్వు కూడా మీ నాన్నలాగా తయారవడం ఖాయం“ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అనంతరం.. ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలానికి వెళ్లారు.
#WATCH | Kurnool, Andhra Pradesh: Prime Minister Narendra Modi inaugurates, lays the foundation stone and dedicates to the nation multiple development projects worth around Rs. 13,430 crore
(Source: DD) pic.twitter.com/l5q65dxZjg
— ANI (@ANI) October 16, 2025