ప్రజెంట్ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇండియా – పాకిస్తాన్ వార్ ఆగిపోవడానికి కారణం ఏంటి..? ఎవరి మాట వినని సీతయ్య లాంటి నరేంద్ర మోడీ ట్రంప్ చెప్పి చెప్పగానే పాకిస్తాన్ పై వార్ ఎందుకు ఆపేశాడు..? కాశ్మీర్లోని పెహల్గాం లో అటాక్ జరిగినప్పుడు ఎంతమంది బాధితులు కన్నీరు పెట్టుకున్నారో అందరికీ తెలిసిందే. ఆ దృశ్యాలు ఇప్పటికీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంటాయి. మరీ ముఖ్యంగా “నువ్వు వెళ్లి మీ మోడీకి చెప్పుకో” అంటూ టెర్రరిస్టులు అంత పొగరుతో మాట్లాడిన మాటలను నరేంద్ర మోడీ అంత ఈజీగా మర్చిపోయారా..?ట్రంప్ ఒక్క ఫోన్ కాల్ చేసి యుద్ధం ఆపేయమనగాని ఎందుకు ఆపేశాడు ..? ఇలా సోషల్ మీడియాలో రకరకాలుగా నరేంద్ర మోడీ పై విరుచుకుపడుతున్నారు జనాలు . ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని అప్పుడే మరచిపోయారా నరేంద్ర మోడీ గారు అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . నిజానికి ఇండియా – పాకిస్తాన్ వార్ జరుగుతున్న ప్రతి సమయంలోనూ పాకిస్తాన్ మిస్సైల్స్ ని పాకిస్తాన్ డ్రోన్ లని తుక్కుతుక్కు చేసింది భారత్ ఆర్మీ . నిజంగా ఇండియా – పాకిస్తాన్ మధ్య వార్ జరిగితే పాకిస్తాన్ దేశం అల్ల కల్లోలంగా తయారై ఉండేది .
ఇప్పటికే ఫైనాన్షియల్ గా భారీ నష్టాన్ని చూసింది పాకిస్తాన్ . సరిగ్గా ఇంకొక వారం రోజులు గాని యుద్ధం చేసుంటే అసలు పాకిస్తాన్ అని పీడ ఇండియాకి విరగడయిపోయేది . మరి ఎందుకు ట్రంప్ ఫోన్ చేసి చేయగానే నరేంద్ర మోడీ వెనక్కి ఇండియన్ ఆర్మీ ని కంట్రోల్ చేసే కాల్పుల విరమణ తీసుకొచ్చారు అంటూ జనాలు ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడుతున్నారు . అయితే చాలామంది నరేంద్ర మోడీ తీసుకున్న డెసిషన్ ని స్వాగతిస్తుంటే మరి కొంత మంది మాత్రం నరేంద్ర మోడీ తప్పు చేశారని ..ట్రంప్ చెప్పిన మాట వినకుండా ఉండాల్సింది అని ..పెహలగంలో జరిగిన అటాక్ ఎప్పటికీ భారతీయులు మర్చిపోరు అని .. కానీ నరేంద్ర మోడీ ఎంత ఈజీగా అటాక్ గురించి మర్చిపోయాడు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉధృత్త పరిస్థితులు కొంచెం తగ్గాయనే చెప్పాలి. గత నాలుగు రోజుల నుండి భారత్ పాకిస్తాన్ ల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం నెలకొన్నిందో అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో అసలు జనాలు ఊపిరి పీల్చుకోవడానికి తెగ ఇబ్బందులు పడిపోయారు . ప్రజెంట్ ఇప్పుడు సరిహద్దు ప్రాంతంలో సాధారణ పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయ. రెండు దేశాల మధ్య ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏర్పడిన ఉధృత్త పరిస్థితులను అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకొని రెండు దేశాలతో సంప్రదింపులు చేసి కాల్పుల విరమణకు అమల్లోకి తీసుకొచ్చారు .
కాగా అసలు ఇండియన్ – పాకిస్తాన్ మధ్య బీకార యుద్ధం జరగబోతుంది అని ఖచ్చితంగా పాకిస్తాన్ దేశం ఇక మ్యాప్ లో ఉండనే ఉండదు అనే రేంజ్ లో మాట్లాడుకున్నారు ఇతర దేశాలు . అయితే ట్రంప్ తనదైన తెలివితో ఆలోచించి భారత్ – పాక్ ల మధ్య యుద్ధానికి బ్రేక్ పెట్టేసారు. కాగా ట్రంప్ చెప్పి చెప్పిన మాట విన్నందుకు ఇప్పుడు భారత్ కి అటు పాక్ కి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు ఓ న్యూస్ నేషనల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తలు ఇప్పుడిప్పుడే సర్దుమడుగుతున్న వేళ ట్రంప్ ఇరదేశాలకి భారీ ఆఫర్ ఇచ్చారు .కాగా ట్రంప్ ఇండియా 0 పాకిస్తాన్ కాల్పుల విరమణ అంగీకరించడం పై మరొక సారి స్పందించారు . “యుద్ధం వస్తే ఇరు రెండు దేశాలకు తీవ్ర నష్టం కలుగుతుంది ఆ విషయాన్ని గ్రహించి ఇరు దేశ పెద్దలు మంచి నిర్ణయం తీసుకున్నారు.. రెండు దేశాలల్లో ఎంతో శక్తివంతమైన నాయకులు ఉన్నారు అని.. ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం వల్ల రెండు దేశాలకు బాగా మేలు జరుగుతుందని .. అది అమెరికా సహాయపడటం వల్ల జరగడం ఇంకా గర్వకారణంగా ఉంది ” అంటూ ట్రంప్ పేర్కొన్నారు . అంతేకాదు రెండు దేశాలతో వాణిజ్యం ఇంకా ఎక్కువ స్ధాయిలో పెంచుకుంటామని ..రెండో దేశాలతో స్నేహపూర్వ సంబంధాలను కంటిన్యూ చేస్తామని ప్రకటించారు . దీంతో ట్రంప్ ఇండియాకి ఏదో భారీ ఆఫర్ ఇచ్చేటట్లు ఉన్నారు అంటూ నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పట్టాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ పై భారత్ ప్రతికారం తీర్చుకుంది. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్ర స్థావరాలు, శిక్షణా కేంద్రాలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసింది. వందకు పైగా మంది టెర్రరిస్తులను హతమార్చింది. ఇందుకు రగిలిపోయిన పాక్.. భారత్‌పైకి క్షిపణులు, డ్రోన్లతో దాడులకు తెగబడింది. వాటిని సమర్థంగా ఎదుర్కొన్న భారత్ రక్షణ వ్యవస్థలు.. బలమైన ప్రతీకార దాడులు చేశాయి.మొదట యుద్ధం కోసం ఉవ్విళ్లూరిన పాక్.. భారత్ దాడులను ఇటు తట్టుకోలేక, అటు తిప్పికొట్టలేక అల్లాడిపోయింది. ఆర్థికంగా చితికిపోయింది. భారత్‌తో కాళ్ల బేరానికి వచ్చింది. అయితే భారత్ వెనక్కి తగ్గుతుందని ఎవరూ ఊహించలేదు. కాల్పులు, మిస్సైల్ దాడులతో ఇరుదేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో అనుహ్యంగా శనివారం సైనిక ఘర్షణలకు తెరదించుతూ భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
కాల్పుల విరమణ వార్త వెలువడిన వెంటనే నెట్టింట మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యుద్ధాన్ని నివారించడానికి కొందరు స్వాగతిస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాతో యుద్ధానికి పాక్ వెనక తగ్గడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో దారుణంగా దిగజారిన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు పాక్ ఇటీవల ఇంటర్నేషన్ మానిటరీ ఫండ్‌కి అప్పు కోసం వెళ్లింది. భారత్ అప్పు మంజూరు చేయొద్దని చెప్పినా.. IMF రూ.8500 కోట్ల రుణం ఇచ్చింది. అదే సమయంలో భారత్ తో యుద్దం విషయంలో వెనక్కి తగ్గాలని కండీషన్ పెట్టింది.అలాగే అమెరికా అనుమతి లేకుండా IMF పాకిస్తాన్‌కు లోన్ మంజూరు చేయదు. ఈ నేపథ్యంలోనే అమెరికా సైతం భారత్‌పై దాడుల విషయంలో పాక్‌కు అక్షింతలు వేసింది. అమెరికా జోక్యంతోనే భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం అదుపులోకి వచ్చింది. పాక్ వెనక్కి తగ్గడానికి బలమైన కారణమే ఉన్నా.. భారత్ ఎందుకు కాల్పల విరమణకు అంగీకరించో అర్థం కాని పరిస్థితి. అసలు యుద్ధం ఎందుకు మొదలు పెట్టినట్టు? ఏం సాధించినట్టు? శత్రువు బలహీనంగా మారాక ఎందుకు వదిలేసినట్లు? అన్న ప్రశ్నలు మోదీ ప్రభుత్వంపై వెల్లువెత్తున్నాయి. పాక్ కు ఈసారి భారత్ శాశ్వత గుణపాఠం చెబుతుందని దేశపౌరులు ఎంతగానో ఆశపడ్డారు. కానీ వారి ఆశ చిరవకు నిరాశే అయింది.