పిఠాపురం వర్మ గా ప్రసిద్ధి చెందిన ఎస్వీ ఎస్ ఎన్ వర్మకు ప్రాణ భయం ఉందా. ఉంటే ఎవరి నుంచి ఉంది ఇత్యాది ప్రశ్నలు ఇపుడు పుట్టుకొస్తున్నాయి. ఆయన మాజీ ఎమ్మెల్యే. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జిగా ఉన్నారు. పార్టీ పరంగా ఎంతో కష్టపడతారు. టీడీపీని గట్టిగా నిలబెట్టారు. అన్ని వర్గాల మద్దతు ఉన్న నాయకుడు. అలాంటి వర్మకు ప్రమాదం పొంచి ఉందా అన్న చర్చ సాగుతోంది. ఉంటే గింటే ఎవరి నుంచి అని కూడా ఆలోచిస్తున్నారు. వర్మ అందరి వాడుగా అజాత శతృవుగా పేరు తెచ్చుకున్నారు కదా అని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తనకు వ్యక్తిగతంగా ప్రమాద భయం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల వర్మ లేఖ రాశారని చెబుతున్నారు. అందులో తనకు తగిన భద్రత కల్పించాలని ఆయన కోరినట్లుగా అంటున్నారు. వర్మ కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆయనకు వ్యక్తిగత భద్రతను కల్పించింది. వర్మకు వన్ ప్లస్ వన్ గన్ మెన్లను కేటాయిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వర్మ ఒక పూర్తి రక్షణ లోకి వెళ్ళారు అని చెబుతున్నారు.
మరో వైపు చూస్తే రాజకీయ ప్రత్యర్ధులు తప్ప వర్మకు ఎవరూ శతృవులు లేరని అంటున్నారు. ఆయనకు ఎవరి నుంచి ముప్పు ఉన్నట్లుగా ఆధారాలు కానీ దాఖలాలు కానీ లేవని కూడా అంటున్నారు. ఇక ఇంటెలిజెన్స్ అభిప్రాయం వేరేలా ఉందని అంటున్నారు. వారి అభిప్రాయం ప్రకారం చూస్తే కనుక వర్మ భద్రతకు వచ్చిన ముప్పు ఏమీ లేదని కూడా అంటున్నారు. ఆయనకు గన్‌మెన్లు అవసరం లేదని దానికి సరైన ఆధారాలు చూపించలేవని చెబుతున్నారు. ఇక ఇంటెలిజెన్స్ వారి నుంచి అలాంటి నివేదిక ఏమీ కూడా లేదని అంటున్నారు. ఇది కూడా ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
మరో వైపు చూస్తే పిఠాపురం వర్మ ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. అయితే అది ఇప్పట్లో తీరే అవకాశం లేదని అంటున్నారు. అలాగే ఆయనకు నామినేటెడ్ పదవి కూడా దక్కలేదన్న బాధ ఆయన అనుచరులలో ఉంది. ఇంకో వైపు నియోజకవర్గం జనసేన ఆధీనంలో ఉంది. సాక్ష్యాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తున్నారు. అయినా సరే టీడీపీ రాజకీయ వాటా కోసం వర్మ నాయకత్వంలో ఆ పార్టీ క్యాడర్ తమ వంతుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక కూటమిలో లుకలులకు ఉన్నాయని అంటున్నారు. అవన్నీ రాజకీయ విభేదాలుగానే ఉంటాయి తప్ప వేరేవి కావని అంటున్నారు. అందువల్ల వర్మకు వ్యక్తిగతంగా వచ్చిన ముప్పు అయితే లేదని అనేవారూ ఉన్నారు.
దీంతో వర్మకు సడెన్ గా వన్ ప్లస్ వన్ గన్ మెన్లతో భద్రత కల్పించడం పట్ల రాజకీయంగా చూసినా చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక తనకు వ్యక్తిగత ప్రమాదం ఉంది అన్న వర్మ విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించిందని అంటుంటే, మరోవైపు ఇంటెలిజెన్స్ సూచనలను పక్కన పెట్టి మరీ భద్రత కల్పించారా అన్న చర్చ కూడా సాగుతోందిట. ఏది ఏమైనా ఇక మీదట వర్మ గారు గన్ మెన్ లతో కనిపిస్తారని తన అధికార హవా ఆ విధంగా ఎంతో కొంత తీరబోతోంది అని అంటున్నారు.