గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ శరవగేగంగా జరుగుతుంది. గేం ఛేంజర్ తో టార్గెట్ మిస్ అవ్వడంతో పెద్ది తో బ్లాక్ బస్టర్ టార్గెట్ గా పెట్టుకున్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలో చరణ్ సినిమా విషయంలో డైరెక్టర్ బుచ్చి బాబు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడం కూడా సినిమాకు హైలెట్ అయ్యే అంశంగా చెప్పొచ్చు. పెద్ది నుంచి ఫస్ట్ షాట్ రిలీజ్ చేయగా ఆ షాట్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు మేకర్స్.
జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ రోల్ ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తుంది. ఐతే పెద్ది సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. ఐతే పెద్ది సినిమాను 2026 మార్చి 28న రిలీజ్ అనుకున్నారు. అనుకున్న డేట్ కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఐతే స్టార్ సినిమాలు అందులోనూ పాన్ ఇండియా రిలీజ్ అనుకున్న సినిమాలు ఏవి మొదట అనుకున్న డేట్ కి రాలేదు. అందుకే పెద్ది విషయంలో కూడా అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండేలా ఉంది. పెద్ది సినిమాను మార్చి ఎండింగ్ నుంచి సమ్మర్ కి షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే మార్చి లో నాని ప్యారడైజ్ ని తెస్తున్నారు.
నాని కోసం చరణ్ ఆగిపోతాడా అంటే.. అలా కాదు మార్చి లో రిలీజ్ కన్నా సమ్మర్ హాలీడేస్ లో ఇంకా ఎక్కువ రీచ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. రిలీజ్ క్లాష్ లేకుండా సోలో డేట్ చూసుకుని పెద్ది రిలీజ్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట. ఓ విధంగా ఇది మంచి ఆలోచనే అని చెప్పొచ్చు. పెద్ది సినిమాలో మరోసారి చరణ్ తన నట విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది. మరి పెద్దితో చరణ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అన్నది చూడాలి. చరణ్ మాస్ స్టామినా చూపించేలా పెద్ది ప్రభంజనాలు ఫిక్స్ అంటున్నారు మేకర్స్. బుచ్చి బాబు మాత్రం ఈ సినిమా కోసం తన పూర్తిస్థాయిలో కష్టపడుతున్నాడు.