పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OG). గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తించారు.
ఓజీ సినిమా పాటలు యాక్షన్ గ్లింప్స్ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా పెరిగాయి. భారీ వర్షాన్ని లెక్క చేయకుండా సాగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఆలస్యమైనా ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాను చూడాలనే ఉత్సాహం మరింత పెరిగింది. సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు సంబంధించిన రివ్యూను సెన్సార్ బోర్డు అందించింది. ఈ సెన్సార్ రిపోర్టుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మాస్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఓజీ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, సెన్సార్ బోర్డు మెంబర్స్ వీక్షించారు. ఈ సినిమాపై కోన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హింస, రక్తపాతం, యాక్షన్ సన్నివేశాలు బీభత్సంగా ఉండటంపై కొంత మేరకు సూచనలు అందించారు. డ్రగ్స్, స్మోకింగ్ సన్నివేశాల్లో డిస్ క్లైమర్ ఉంచాలి. చిన్న పిల్లాడు రక్తపు మడుగులో ఉండటం. పోలీస్ జిప్ తీసి చూపించడం.. తెగిన చెయ్యి, తలలు నరకడం లాంటి సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లాడ్డ్‌లో హింస, చేతులు నరకడం, హింసకు సంబంధించి క్లోజప్ సీన్లు తీసేయాలని సూచించారు. దాదాపు 1 నిమిషం.55 సెకన్ల సినిమాను తొలగించాలనిసూచించారు. ఓవరాల్‌గా ఈ సినిమాపై పూర్తిస్థాయి సంతృప్తిని వ్యక్తం చేస్తూ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.
ఓజీ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ డిజైన్ చేసిన విధానం, యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించిన తీరు స్టైలిష్‌గా ఉన్నాయి. పవన్ కల్యాణ్‌ను మాస్ అవతారంలో కొత్తగా చూస్తారు. సినిమాలో ఎలివేషన్స్ బాగున్నాయి. ఫ్యామిలీ డ్రామా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి పాత్రలు థ్రిల్లింగ్ చేస్తాయి. ఈ సినమిాకు ప్రియాంక అరుళ్ మోహన్ ప్రెజన్స్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఓజీ సినిమాలోని కంటెంట్‌ను పరిశీలించిన తర్వాత ఈ మూవీకి A (ఏ) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సెన్సార్ సభ్యుల సూచనల మేరకు, వారి సిఫారసులను అనసరించి ప్రదర్శనకు ఈ సర్టిఫికెట్ జారీ చేయడమైనంది. ఈ సినిమాను వయోజనులకు మాత్రమే ప్రదర్శించే విధంగా A సర్టిఫికెట్‌ను జారీ చేశాం అని తమ సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు. ఈ సర్టిఫికెట్‌ను నిర్మాత డీవీవీ దానయ్యకు చేరవేయడం జరిగింది అని వెల్లడించారు.
ఇక ఈ సినిమా నిడివిని పక్కాగా కట్ చేసినట్టు సర్టిఫికెట్‌లో వెల్లడించిన రన్ టైమ్ ఆధారంగా స్పష్టమైంది. ఈ సినిమా 154.15 నిమిషాలు నిడివి అంటే.. 2 గంటల 34 నిమిషాలు, 15 సెకన్లుగా రన్ టైమ్‌కట్ చేశారు. ఈ మేరకు సెన్సార్ అధికారులు ఈ రన్‌టైమ్‌ను ధృవీకరించారు. దాంతో ఈ సినిమాను అధికారికంగా ప్రదర్శించేందుకు రివ్యూను అందించడమే కాకుండా సర్టిఫై ప్రక్రియను పూర్తి చేశారు. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు మార్గం సుగమమైంది.