పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కి డీసీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈయన.. అధికారాన్ని కొనసాగిస్తూనే మరొకవైపు అభిమానుల కోసం వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఆయన ప్రకటించిన మూడు ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే జ్యోతికృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘హరిహర వీరమల్లు’ సినిమాను విడుదల చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.
ఓజీ సినిమా విషయానికి వస్తే.. సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అనగా సెప్టెంబర్ 2న ఈ సినిమా నుండి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇది ఆధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా హిందీ భాషలో కూడా విడుదల చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. అసలు విషయంలోకి వెళ్తే.. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. ఇమ్రాన్ హస్మీ, శ్రియా రెడ్డి , అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ లో విలన్ వాయిస్ చాలా గంభీరంగా అనిపించింది.
“డియర్ ఓజీ.. నిన్ను కలవాలని.. నీతో మాట్లాడాలని.. నిన్ను చంపాలని.. ఎదురుచూస్తున్నా.. నీ ఓమీ.. హ్యాపీ బర్తడే ఓజీ” అనే విలన్ పవర్ ఫుల్ డైలాగ్ తో గ్లింప్స్ విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు. కానీ ఇప్పుడు ట్రైలర్ కు మించి దీనిపై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాపై ఇప్పుడు పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ కూడా అభిమానులు గ్లింప్స్ కోసం డిమాండ్ చేస్తున్నారు. హిందీ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఓజీ సరైన సినిమా అని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
నిజానికి ఉత్తరాదిలో ప్రమోషన్స్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అభిమానులు ఉత్తరాదిలో ఎక్కువ కార్యక్రమాలను షెడ్యూల్ చేస్తూ పూర్తిస్థాయిలో ముందుకు సాగాలి అని చిత్ర బృందాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ కూడా అటు హిందీలో విడుదల కాలేదు. దీంతో చాలా మంది అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.. అందుకే పవన్ కళ్యాణ్ కి నార్త్ లో మార్కెట్ పెరగాలి అంటే.. నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ఓజీ సరైన అన్ని అవకాశాలను అందుకుందని ,హరిహర వీరమల్లు సినిమా పాత కథ కావడంతో పెద్దగా ఆకట్టుకోలేదని, కానీ ఓజీ నేటి యువతను ఆకర్షించే తాజాదనంతో పాటు స్టైలిష్ టేకింగ్ ను కలిగి ఉంది కాబట్టి ఇది కచ్చితంగా నార్త్ ఆడియన్స్ను మెప్పిస్తుందని కోరుతున్నారు.
దీనికి తోడు ఓజీలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మీ విలన్ గా నటించారు. ఈయనకు పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా ఇప్పటికీ కూడా ఒక వర్గం ఆడియన్స్ ఈయన సినిమాలపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ లో ఇమ్రాన్ హస్మిని సుజీత్ ఒక శక్తివంతమైన పాత్రలో చూపించారు. కాబట్టి ఖచ్చితంగా ఇది నార్త్లో మంచి ఓపెనింగ్ రాబట్టడానికి దోహదపడుతుందని, దయచేసి అక్కడ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు . మరి అభిమానుల కోరిక మేరకు నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.















