పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అయిన సుజీత్ ఆయన్ను డైరెక్ట్ చేసిన సినిమా ఓజీ. ఫ్యాన్స్ ఎలా అయితే పవర్ స్టార్ ని చూడాలని అనుకుంటున్నారో దాన్ని మ్యాచ్ చేస్తూ సుజీత్ చేసిన ఓజీ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమాలో పవన్ కళ్యాణ్ ని ప్రతి ఫ్రేమ్ లో ఎంతో అందంగా చూపించాడు సుజీత్. ఐతే పవర్ స్టార్ కి కూడా ఈ సినిమా చాలా శాటిస్ఫ్యాక్షన్ ఇచ్చింది. అందుకే ఓకీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ తాను డైరెక్షన్ చేసే టైం లో ఇలాంటి టీం ఉంటే బాగుండేదని అన్నారు. సో సుజీత్ అతని డైరెక్షన్ టీం అంతా చాలా బాగా పవన్ కళ్యాణ్ ని ఇంప్రెస్ చేశారు .
ఓజీ సక్సెస్ మీట్ లో ఓజీ సీక్వెల్, ప్రీక్వెల్ దేనికైనా తాను రెడీ అన్నారు పవన్ కళ్యాణ్. సో సుజీత్ తో మళ్లీ పనిచేయాలన్న ఇంట్రెస్ట్ ని ఆయన వ్యక్తపరిచారు. ప్రస్తుతం సుజీత్ నానితో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఆ మూవీ రిలీజ్ ఉంటుంది. ఐతే నాని సినిమా రిలీజ్ అవ్వగానే సుజీత్ ఓజీ 2 పనులు మొదలు పెడతారని తెలుస్తుంది.
ఓజీ 2లో మరిన్ని సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసేలా సుజీత్ ఆలోచన ఉందట. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా మరోసారి అదుర్స్ అనిపించేలా సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉంటుందని తెలుస్తుంది. ఓజీ పార్ట్ 2 వస్తే అది అంతకుమించేలా చేయాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో సీక్వెల్, ప్రీక్వెల్ గురించి అసలు థింక్ చేయరు. ఇన్నేళ్ల కెరీర్ లో ఇన్ని సినిమాల్లో ఏ సినిమాకు ప్రీక్వెల్ లేదా సీక్వెల్ రాలేదు. హరి హర వీరమల్లు పార్ట్ 2 అనౌన్స్ చేశారు.
ఐతే ఆ సినిమా కన్నా ముందు ఓజీ 2 వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. సుజీత్ కూడా ఓ పక్క నాని సినిమా చేస్తున్నా కూడా పవర్ స్టార్ సినిమా గురించి మరోపక్క ఆలోచిస్తున్నాడని తెలుస్తుంది. రీసెంట్ గానే ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిందుకు 3 కోట్ల విలువ గల ఒక లగ్జరీ కారును పవన్ కళ్యాణ్ సుజీత్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. సో ఈ బూస్టింగ్ తో అయినా ఓజీ 2 ని మరింత భారీగా ప్లాన్ చేస్తారని చెప్పొచ్చు. ఓజీ సినిమాలో ఆల్రెడీ సాహో రిఫరెన్స్ వాడారు కాబట్టి ఒకవేళ ఈ పార్ట్ 2లో ప్రభాస్ ఏమైనా ఉండే ఛాన్స్ లు ఉన్నాయా అన్న డిస్కషన్ కూడా జరుగుతుంది. అదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ పక్కా అని చెప్పొచ్చు.



















