పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా రెండోసారి మహబూబ్‌నగర్‌కు చెందిన పబ్బ సురేశ్ బాబు(Pabba Suresh Babu)
న్యూఢిల్లీ: (Delhi)ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)pci తన తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆదివారం సంగీతా బరూవా పిషారోటిని ఎన్నుకుంది. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రయాణంలో లింగ సమానత్వం, సమ్మిళిత నాయకత్వం దిశగా ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. డిసెంబర్ 13న జరిగిన ఎన్నికల్లో పిషారోటి బృందం కార్యనిర్వాహక, మేనేజింగ్ కమిటీలోని అన్ని పదవులను కైవసం చేసుకుంది. 21-0 తేడాతో ఘన విజయం సాధించింది. పిషారోటి 1,019 ఓట్లతో నిర్ణయాత్మక విజయం సాధించగా, ఆమె ప్రత్యర్థులు కేవలం అతుల్ మిశ్రా 129 ఓట్లు, అరుణ్ శర్మ 89 ఓట్లు పొందారు. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడ్డ అఫ్జల్ ఇమామ్ సునాయాసంగా విజయం సాధించారు. అఫ్జల్ ఇమామ్‌కు 948 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి జ్ఞాన్ ప్రకాష్‌కు కేవలం 290 ఓట్లు వచ్చాయి.
పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా రెండోసారి తెలంగాణ రాష్ట్రంలోని(Telangana ) మహబూబ్‌నగర్‌కు చెందిన పబ్బ సురేశ్ బాబు ఎన్నికయ్యారు. ఫలితాల అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్యానెల్ దేశవ్యాప్తంగా జర్నలిస్తుల హక్కుల కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతుందని చెప్పారు. జర్నలిస్ట్‌లపై ఎలాంటి దాడులు, సంఘటనలు జరిగినా ఖండించిడంతో పాటు.. వారికి న్యాయం చేకూర్చడంలో ముందుంది అన్నారు. ఇకపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల వాయిస్ వినిపించేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. తన గెలుపుకోసం సహకరించి ఓట్లతో మద్దతు తెలిపిన పీసీఐ మెంబర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన జతిన్ గాంధీ 1,029 ఓట్లు సాధించి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ప్రహ్లాద్ సింగ్ రాజ్‌పుత్‌పై 900 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. అదితి రాజ్‌పుత్ (కోశాధికారి), పిఆర్ సునీల్ (సంయుక్త కార్యదర్శి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పీసీఐ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంఎంసి శర్మ, అతని బృందం సాయంత్రం పీసీఐ ప్రాంగణంలో విలేకరులతో ఫలితాలను ప్రకటించారు. 16 మంది సభ్యుల మేనేజింగ్ కమిటీ ఎన్నికలలో, నీరజ్ కుమార్ 932 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు.
ఆ తర్వాత Pabba Suresh Babu(838), అభిషేక్ కుమార్ సింగ్ (911), జాహ్నవి సేన్ (903), అశోక్ కౌశిక్ (892), కల్లోల్ భట్టాచార్జీ (882), ప్రవీణ్ జైన్ (878), అగ్రాజ్ ప్రతాప్ సింగ్ (865), మనోజ్ శర్మ (861), నయనిమా బసు (851), విపి పాండే (833), ప్రేమ్ బహుఖండి (831), స్నేహా భూరా (829), జావేద్ అక్తర్ (823), రెజౌల్ హసన్ లస్కర్ (781), సునీల్ కుమార్ (780) ఉన్నారు. “ఈ ఎన్నిక మా ప్యానెల్ దార్శనికతపై, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, బాధ్యతాయుతమైన జర్నలిజం విలువలను నిలబెట్టడంలో మాకున్న సుదీర్ఘ నిబద్ధతపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సభ్యుల సామూహిక విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది,” అని ఫలితాల ప్రకటన తర్వాత పిషారోటి అన్నారు.
ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సభ్యుల నమ్మకం, మద్దతుకు పదవీ విరమణ అధ్యక్షుడు గౌతమ్ లాహిరి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త బృందం క్లబ్‌ను మరింత కలుపుకొని, అన్ని అంశాలు, సమస్యలకు ప్రతిస్పందించేలా, భారతదేశంలో నేడు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో కొనసాగుతుందని ఆయన ఆశించారు.
“ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, దాని ప్రారంభం నుండి, దేశవ్యాప్తంగా, విదేశాల నుండి వచ్చిన జర్నలిస్టులకు ఒక ముఖ్యమైన సంస్థగా పనిచేసింది. దాని మొదటి మహిళా అధ్యక్షురాలి ఎన్నిక పురోగతికి శక్తివంతమైన చిహ్నంగా, సమానత్వం, వైవిధ్యం, ప్రజాస్వామ్య విలువల పట్ల క్లబ్‌కు ఉన్న అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తుంది” అని పిసిఐ పదవీ విరమణ కార్యదర్శి నీరజ్ ఠాకూర్ అన్నారు.















