థియేటర్లలో ఓజీ సందడి పీక్స్ కి చేరుకుంది.. ఒక రోజు ముందే ప్రీమియర్ షోలో మెగా హీరోల సందడే సందడి. ఈపాటికే ఓజీ రివ్యూలు కూడా వచ్చేసాయి. ఓజీ అలియాస్ ఓజాస్ స్టైల్ కంటెంట్, ఎలివేషన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! అంటూ సమీక్షకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్రను పాజిటివ్‌గా హైలైట్ చేయడంతో దాని రేంజు ఎలా ఉందో ఇప్పుడు యంగ్ హీరోల ఎక్స్‌ప్రెషన్స్ కూడా చెబుతున్నాయి.
రోజు ముందే సెలబ్రిటీ ప్రివ్యూ షోలో సందడి చూస్తున్నారు కదా! మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా మేనల్లుడు సాయి తేజ్ రచ్చ రచ్చ చేస్తున్నారు. స్క్రీన్ పై ఓజీ ఆరంగేట్రం, పంచ్ లకు లేచి గాల్లో స్లిప్స్ విసురుతున్నారు. థియేటర్ మొత్తం కాగితపు స్లిప్స్ తో నిండిపోతోంది. వరుణ్- సాయితేజ్ పక్కపక్కనే కూచుని మరీ సినిమా చూస్తున్నారు. ఇంతలోనే ఆ పక్కనే ఉన్న హరీష్ శంకర్ వచ్చి నేరుగా సాయి తేజ్ వద్దకు వచ్చి ఒక హగ్ కూడా ఇచ్చాడు. హరీష్ తదుపరి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ కోసం హుషారుగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు థియేటర్‌లోను అతడి జోష్ మరో లెవల్లో కనిపిస్తోంది.
పవర్ స్టార్ సినిమా రిలీజవుతోంది అంటే ఆయన అభిమానుల్లో ఉండే సందడి అంతా ఇంతా కాదు. నేడు ప్రపంచవ్యాప్తంగా పవన్ ఫ్యాన్స్ `ఓజీ` థియేటర్లకు సునామీలా పోటెత్తారు. మొదటిరోజు, తొలి వీకెండ్ లో ఓజీ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కంటెంట్ ఎలా ఉన్నా కటౌట్ ని ఎలివేట్ చేయడంలో సుజీత్ మ్యాజిక్ చేసాడని పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ మాత్రం టాక్ చాలు.. పవన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడానికి.. ప్రస్తుతానికి థియేటర్లలో ప్రేక్షకులు ఓజీ మూవ్ మెంట్స్ ని ఆస్వాధిస్తున్నారు. మరి కాసేపట్లో యూట్యూబులు, సోషల్ మీడియాల్లో ప్రేక్షకుల సమీక్షలు అసలైన మౌత్ టాక్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.