పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ ఓజీ ’ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో పవన్ కళ్యాణ్ పూర్తిగా వింటేజ్ మోడ్‌లో కనిపించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. విడుదలైన మొదటి రోజునుంచే థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. పవన్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించాయి. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్ మార్కెట్‌లో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. కేవలం ఐదు రోజుల్లోనే 200 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం పవన్ కెరీర్‌లోనే ఒక భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మొదటి వారం వరకు కలెక్షన్స్‌లో ఎటువంటి తగ్గుదల లేకుండా దూసుకెళ్లింది.
సుజిత్ స్టైలిష్ డైరెక్షన్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్‌కి సరిపోయే రీతిలో మాస్ ఎలిమెంట్స్, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్ కలిపి ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామాను అందించారు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమన్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటించారు. ఆమె సింపుల్ రోల్ అయినప్పటికీ ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది. ప్రకాష్‌రాజ్, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్‌లో సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో “ఇది పవన్ కళ్యాణ్ మాస్ రీఎంట్రీ”, “వింటేజ్ పవన్ బ్యాక్”, “సుజిత్ పవర్‌ను రివైవ్ చేశాడు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.