పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్, విడుదలైన రోజు నుంచే సెన్సేషనల్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. భారీ అంచనాల నడుమ థియేటర్స్‌కి వచ్చిన ఈ సినిమా, మొదటి రోజే ఆల్ టైం రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించి పవన్ క్రేజ్‌ను మరోసారి రుజువు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా కలెక్షన్లతో దుమ్ము లేపింది. ఈ సారి సరైన ప్రమోషన్లు లేకుండానే తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఓజినీ రిలీజ్ చేశారు.
తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్లు రిలీజ్ అయినా, ప్రారంభంలో పెద్దగా కలెక్షన్లు రాలేదు. ముఖ్యంగా సౌత్‌లో ఇతర భాషా వెర్షన్లకు ఎటువంటి బజ్ లేకపోవడంతో పెద్దగా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ నమోదు కాలేదు. కానీ, హిందీ మార్కెట్‌లో మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. మొదటి రోజుల్లో అంతగా ఆకర్షించని ఈ సినిమా, నెమ్మదిగా నార్త్ ఇండియాలో పుంజుకుంటున్నట్లుగా టాక్ వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ పెరగడంతో అదనంగా షోలు పెరుగుతున్నాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా నార్త్ ఇండియా ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు, థియేటర్స్‌లో పబ్లిక్ రెస్పాన్స్ వీడియోలు వైరల్ అవుతుండటంతో అక్కడ గ్రోత్ స్పష్టంగా కనబడుతోంది. పవన్ కళ్యాణ్‌కి హిందీ మార్కెట్ కొత్తది కాదు. గతంలో ఆయన నటించిన కొన్ని చిత్రాలు డబ్బింగ్ రూపంలో అక్కడ టెలివిజన్‌లో, యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందాయి. ఈసారి ఓజీతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు.