టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఓజీ మూవీపై ఆడియన్స్, ఫ్యాన్స్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ హోప్స్ ఉన్నాయి. అప్పట్లో వరుస అప్డేట్స్ తో వాటిని పెంచిన మేకర్స్.. ఇప్పుడు మళ్లీ ఫైర్ స్మార్ట్ తో ఒక్కసారిగా సంచలనం సృష్టించారు.
ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటున్న ఫస్ట్ సింగిల్.. సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. 24 గంటల్లో అత్యధికంగా లైక్స్ పొందిన తెలుగు పాటగా రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అదే సమయంలో మేకర్స్ కు రెండు పనులు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు అభిమానులు.
ఓజీ టీ షర్ట్స్, కీ చైన్స్, కాప్స్ సహా పలు వస్తువులను అధికారికంగా రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల విషయంలో అలా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓజీ మేకర్స్ అది ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. అయితే అలా చేయడం వల్ల అటు అభిమానులు సాటిస్ఫై అవుతారు. ఇటు బజ్ కూడా ఇంకా పెరగనుంది. భావోద్వేగపరంగా, వాణిజ్యపరంగా అర్థవంతమైన చర్య అని చెప్పాలి. మరోవైపు, ఫైర్ స్టార్మ్ సాంగ్ ను ప్రమోట్ చేయడానికి మేకర్స్ కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో టై అప్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఆ విషయంలో ఫ్యాన్స్ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ను ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు.
అందులో కొందరు ఎవరికీ తెలియదని.. మరికొందరు ఇప్పటికే ట్రోలింగ్ ఎదుర్కొన్నారని అంటున్నారు. అలాంటి వాళ్లతో ప్రమోషన్స్ కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. సినిమా గొప్పతనానికి సరిపోయేలా ఉండాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆ రెండు రిక్వెస్టుల విషయంలో మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాలి. ఇక సినిమా విషయానికొస్తే.. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతరులు ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కానుంది.
పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘హరిహర వీరమల్లు’ ఎలాంటి ఫలితం సాధించిందో తెలిసిందే. ఐదు సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన సినిమా పవన్ మేనియాతో అద్భుతాలు సృష్టిస్తుందనుకుంటే? అందుకు భిన్నమైన ఫలితాన్ని సాధించింది. తొలి షోతోనే బాక్సాఫీస్ వద్ద తేలి పోయింది. కానీ ఈ సినిమా సక్సెస్ కోసం పవన్ అండ్ కో ఎంతగా శ్రమించారు! అన్నది మాటల్లో చెప్పడం సాధ్యం కానిది. ఏ సినిమాను ప్రమోట్ చేయనంతగా పవన్ వీరమల్లును ప్రమోట్ చేసారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రమే పరిమితవుతారు అనుకున్న పవన్ చివరి నిమిషయంలో తన భుజాలపైనే ప్రచార బాధ్యతను మోసారు. దాదాపు ప్రతీ మీడియాతోనూ ఇంటరాక్ట్ అయ్యారు. ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ఇంత వరకూ పవన్ ఏ సినిమాకు ఇలాంటి ప్రచారం కల్పించలేదు. వీరమల్లు కోసం మాత్రం ఎంతో వ్యక్తిగత సమాయాన్ని కేటయించడం విశేషం. ఆయనతో పాటు అభి మానులు, జనసేన నాయకులు, సైనికులు కూడా సినిమా ప్రచారంలో కీలక పాత్ర పోషించారు.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కొన్ని సినిమాలు చేసారు. కానీ ఏ సినిమాకు సైనికులు, పార్టీ నాయ కులు ఇలా పని చేయలేదు. తొలిసారి వీరమల్లు కోసం మేము సైతం అంటూ అంతా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి శక్తి వంచన లేకుండా పని చేసారు. కానీ ఫలితం మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. పవన్ అండ్ కో చేసిన ప్రచారం ఎంత మాత్రం కలిసి రాలేదు. ఇక్కడ రాజకీయంగానూ సినిమాపై చాలా ప్రభా వం చూపించింది. పవన్ రాజకీయ వ్యతిరేక వర్గం `బోయ్ కట్` ట్రెండ్ ను తెరపైకి తేవడంతోనూ కొంత దెబ్బ పడింది.
ఆ సెక్షన్ ఆడియన్స్ ఎవరూ వీరమల్లు ను ఆదరించలేదు. అదంతా పక్కన బెడితే? కథా బలం లేని సినిమా కావడంతో ప్రేక్షకులకు రుచించలేదన్నది ప్రధాన కారణం. వీరమల్లుకు సంబంధించి ఇదంతా గతం. ఈ అనుభవం నుంచి పవన్ ఏం నేర్చుకున్నారు? అన్నది భవిష్యత్ కు కీలకం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో `ఓజీ` చేస్తున్నారు. ఈ చిత్రం అన్ని పనలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే పవన్ షూటింగ్ కూడా పూర్తి చేసారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాద్ భగత్ సింగ్` లోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు పవన్ ప్రచారం కూడా ఎంతో కీలకమైంది. ఇవి కూడా రిలీజ్ అలస్యమవుతోన్న చిత్రాలే. వీటిని కూడా పవన్ తన భుజాలపై వేసుకునే ప్రచారం చేస్తారనే మాట బలంగా వినిపిస్తుంది. అయితే వీటి ప్రచార వ్యూహం ఎలా ఉంటుంది? అన్నది ఇంట్రెస్టింగ్. వీరమల్లు సమయంలో తలెత్తిన ప్రతికూలతకు ఇక్కడ అవకాశం ఇవ్వ కూడదు. రిలీజ్ కు ముందు పక్కా ప్రణాళికతో ప్రేక్షకుల్లోకి వెళ్లాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఆ వ్యూహం ఉండాలి.